Paris charlie hebdo attack

Paris Charlie Hebdo attack, Charlie Hebdo attack, Paris terrorist attack, Charlie Hebdo attack updates, Charlie Hebdo attack deaths, Paris in high alert, paris attack, Charlie Hebdo attack update, Paris attack terrorists, paris paper attack suspects, world latest news, latest news update

Paris Charlie Hebdo attack : suspects identified in Charlie Hebdo Office Attack incident. France in High Alert after terrorists attack on Charlie Hebdo paper office. 12 people died in terrorist attack in Paris

ప్యారిస్ లో మారణ హోమం, దేశవ్యాప్తంగా హై అలర్ట్

Posted: 01/08/2015 07:34 AM IST
Paris charlie hebdo attack

దుండగుల దాడితో ప్యారిస్ వణికిపోతుంది. ‘చార్లీ హెబ్డో’ పత్రిక కార్యాలయ సమీప ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ‘చార్లీ హెబ్డో’ కార్యాలయంపై బుధవారం కొందరు దుండగులు జరిపిన దాడిలో 12మంది చనిపోయారు. మృతుల్లో చీఫ్ ఎడిటర్, కార్టూనిస్టులు, పోలిసులు ఉన్నారు. ఒక మతాన్ని కించపర్చేలా పత్రిక కథనాలు రాసిందని ఆగ్రహిస్తూ ఈ దాడి చేశారు. ముగ్గురు ఉగ్రవాదులు ముసుగులతో పత్రికా కార్యాలయంోలకి వచ్చి దాడులు జరిపారు. తుపాకులు, రాకెట్ లాంచర్లతో దాడి చేసి హడలెత్తించారు.

charlie-hebdo-paper-attack0.jpg

ఈ ఘటనలో ఫ్రాన్స్ ఉలిక్కి పడింది. ప్రధాని హోలండ్ ఈ దాడిని ఖండించారు. దేశ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈఫిల్ టవర్ ను మూసివేశారు. దేశంలోని రైల్వేస్టేషన్లు, మ్యూజియంలు, ప్రధాన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గతంలో కూడా ఈ పత్రికపై విమర్శలు, కేసులు నమోదయ్యాయి. బుధవారం రోజు కూడా ‘ భవిష్యత్తులో ఫ్రాన్స్ ను ముస్లిం ప్రభుత్వం పరిపాలిస్తుంది’ అని కార్టూన్ తో ఎడిషన్ వచ్చింది. చీఫ్ ఎడిటర్ ను చంపేస్తామని ఉగ్రవాదులు బెదిరించిన నేపథ్యంలో పోలిసులు భద్రతను ఏర్పాటు చేశారు. అయినాసరే వారు అనుకున్న పని చేసి చూపారు.

harlie-hebdo-office-attack.jpg

మరోవైపు ఈ ఘటనలో అనుమానితులను పోలిసులు గుర్తించారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉగ్రవాద దాడితో దేశ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడే, భావాలను చెప్పే స్వేచ్ఛ కూడా లేకపోవటం సిగ్గుచేటని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ దేశాలన్ని ప్యారిస్ దాడిని ఖండిస్తున్నాయి. పత్రికా స్వేచ్చను కాపాడాలని డిమాండ్లు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charlie Hebdo attack  paris news  terrorist attack  

Other Articles