Coast guard intercepts pak terror boat off gujarat coast occupants blow themselves up

coast guard, terrorist plans to attack in gujarat, Indian Coast Guard intercepted a suspicious, Pakistani fishing boat, indian coast guard suspicias pakistani fishing boat

another attempt to unleash havoc on Indian shores like the 26/11 terror strikes, the Indian Coast Guard intercepted a suspicious Pakistani fishing boat

పేల్చుకున్న పిరికిపందలు, దేశానికి తప్పిన ముప్పు

Posted: 01/02/2015 04:39 PM IST
Coast guard intercepts pak terror boat off gujarat coast occupants blow themselves up

దేశానికి పెను ముప్పు తప్పింది..,

సరిగ్గా ఇలాంటి వ్యక్తులే ఆరేళ్ళ  క్రితం ముంబైలో ప్రవేశించారు. ముంబై సముద్ర తీరం గుండా ప్రవేశించి మన దేశ అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. అప్పుడు జరిగిన మారణ కాండకు జాతి యావత్తు నివ్వెర పోయింది. ఇంకా ఆ గుర్తులు దేశ ప్రజల గుండెల్లో బీతిని కలిగిస్తూనే ఉన్నాయి. మళ్ళి సరిగ్గా అలాంటి సంఘటనే లక్ష్యంగా ఇప్పుడు కొందరు ఉగ్రవాదులు భారత్ లో నర మేధం సృష్టించటానికి గుజరాత్ లోని పోరు బందరు సముద్ర తీరం గుండా వచ్చారు. సరిగ్గా నిఘా వర్గాలు దేశాన్ని మొత్తం అప్రమత్తం చేసిన రోజే ఈ సంఘటన జరగటం గమనార్హం.

పోరుబందర్ తీరం గుండా గుజరాత్ రాష్ట్రము లోకి ప్రవేశించటానికి ఒక 5 గురు తీవ్ర వాదులు విఫల యత్నం చేశారు. సముద్ర తీరం గుండా ఒక ఫిష్ బోటు లో వస్తున్న వీరిని భారత నౌకా దళం గమనించి వారిని వెంబడించింది. దాంతో ఆ పిరికి పందలు తమ ను తామే పేల్చుకున్నారు. ఆ పడవ లో భయంకరమైన ఆయుధాలు మరియు  పేలుడు సామాగ్రి ఉన్నట్లు గుర్తించారు. అరేబియా సముద్రం లో జరిగిన ఈ సంఘటన తో దేశ భద్రత దళాలు అప్రమత్త మయ్యాయి. దేశ రాజధానితో పాటుగా వివిధ నగరాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆ పడవలో పేలుడు పదార్థాలు భారి మొత్తం లో ఉన్నట్లు తీర ప్రాంత రక్షక దళం గుర్తించింది. కచ్చితంగా ఇది ఒక పెద్ద కుట్ర లానే కొందరు అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మన భద్రత దళాల అప్రమత్తత తో ఒక పెద్ద ముప్పు నుండి బయట పడినట్లయ్యింది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistani fishing boat  indian coast guard  gujarat  

Other Articles