Dalai lama says indians are his mentor

Dalai Lama says Indians are his mentor, Tibetan spiritual leader dalai lama, Nobel peace prize winner Dalai Lama, dalai lama maiden visit to gujarat, dalai lama considers Indians as Guru, dalai lama india visit, india, spritual india,

Tibetan spiritual leader and Nobel peace prize winner Dalai Lama, who is on his maiden visit to Gujarat, on Thursday said he considers Indians as his "Guru".

భారతీయులు తన గురువులుంటూ అభివర్ణించిన ఆదిగురువు

Posted: 01/01/2015 08:24 PM IST
Dalai lama says indians are his mentor

భారతీయులను తన గురువులు అంటూ టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు, నోబుల్ బహుమతి గ్రహీత దలైలామా సంబోధించారు.. తొలిసారిగా గుజరాత్‌కు వచ్చిన ఆయన సూరత్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ భారతీయులు తనకు గురువులని వ్యాఖ్యానించారు. భారత దేశంలో అతి ప్రాచీన కాలం నుంచి వున్న అతిపురాతన భౌద్దారామం నలందా వుందని, అందుచేతనే భారతీయులు సంప్రదాయ బద్దంగాను, చారిత్రాత్మకంగాను తమకు గురువులంటూ దలైలామా పేర్కొన్నారు. నలందా విశ్వవిద్యాలయం ప్రపంచ బౌద్దారమాల్లో ముఖ్య కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు.

తన మది నిండా నలందానే వుంటుందన్నారు. అందుకనే భారతీయులకు తాము శిష్యులమని వెల్లడించారు. అందుచేత తాను తన శుభాకాంక్షలను, పొడగ్తలను గురువుకు అందజేస్తున్నట్లు చెప్పారు. దలైలామా రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ లో పర్యటించనున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా దలైలామాకు సంటోక్బ అవార్డను అందజేయనున్నారు. బాంగారు పూతతో చేసిన అవార్డుపై సుమారు 25 లక్షల రూపాయల విలువైన వజ్రాలతో కూడిన అవార్డుతో గుజరాత్ కు చెందిన గోవింద్ దోలఖియా అనే వ్యాపారవేత్త తన తల్లి సంస్మరణార్థం అవార్డును దలైలామాకు అందజేయనున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dalai Lama  Tibetan spiritual leader  Nobel peace prize winner  India  

Other Articles