Two years child killed her mom mom of tot taken hostage at wal mart

two years child killed her mom, 2 years child, walmart incident, midwest city incident

2-year-old girl hostage inside a Walmart in Midwest City

తల్లిని చంపిన రెండేళ్ళ పిల్లాడు

Posted: 12/31/2014 01:30 PM IST
Two years child killed her mom mom of tot taken hostage at wal mart

ఇంకా ఆ పిల్లాడిది పాలు తాగే వయసే... తనకు తెలియకుండానే తన తల్లి ని చంపేసాడు. రెండేళ్ల వయసున్న కొడుకు పొరపాటున తన తల్లిని కాల్చిచంపేశాడు. ఈ ఘటన అమెరికాలోని వాల్ మార్ట్ మాల్లో జరిగింది. 29 ఏళ్ల మహిళ తన కొడుకు, మరో ముగ్గురు పిల్లలతో కలిసి షాపింగ్ చేస్తోంది. ఆమెకు ఆయుధాల లైసెన్సు ఉండటంతో ఓ స్మాల్ క్యాలిబర్ హేండ్ గన్ తన పర్సులో పెట్టుకుంది. ఆ పర్సును ఆమె తన షాపింగ్ ట్రాలీలో పెట్టుకుని వెళ్తుండగా.. ఆ రెండేళ్ల కొడుకు కూడా అదే ట్రాలీలో ఉన్నాడు. వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పొరపాటున ఆ హేండ్ గన్ నొక్కాడు. దాంతో తుపాకి పేలి.. నేరుగా ఆ ట్రాలీని తోసుకెళ్తున్న తల్లికి తగిలింది. ఉదయం 10.20 గంటలకు ఈ ఘటన జరిగే సమయానికి ఆమె భర్త ఆ మాల్ పరిసరాల్లో లేడు. కాల్పులు జరిగిన కొద్ది సేపటి తర్వాత వచ్చిన అతడు.. మిగిలిన పిల్లలను బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. ఇది చాలా బాధాకరమన ఘటన అని వాల్ మార్ట్ ప్రతినిధి బ్రూక్ బుచానన్ అన్నారు.

ఇంతకుముందు కూడా ఇలానే  పొరుగునుండే వాషింగ్టన్ రాష్ట్రంలో గత నవంబర్ నెలలో నాలుగేళ్ల అబ్బాయి మూడేళ్ల మరో కుర్రాడిని ఆడుకుంటూ పొరపాటున కాల్చేశాడు. అలాగే ఏప్రిల్లో కూడా ఫిలడెల్ఫియాలో రెండేళ్ల అబ్బాయి తన 11 ఏళ్ల అక్కను ఆడుకుంటూ తుపాకితో కాల్చి చంపేశాడు. ఇలాంటి ఘటనలు జరగటం నిజంగా దురదృష్టకరమే...

అయినా చిన్న పిల్లల దగ్గర అలాంటి అపాయకరమైన వస్తువులను తల్లిదండ్రులు కూడా అలా ఉంచటం సరైనది కాదని కొన్ని వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని అపాయకరమైన వస్తువుల మీద చిన్న పిల్లల దగ్గర ఉంచవద్దని కూడా రాసి ఉంటుంది కాని కొందరు తల్లిదండ్రులు ఏ మాత్రం పట్టించుకోరనే వాదన ఉంది. ఏది ఏమైనా చిన్న పిల్లల కంట కనబడనీయకుండా ఇలాంటి వస్తువులు ఉంచకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : two years child  walmart incident  midwest city  

Other Articles