Train runs over 5 during track maintenance in bihar

Train accident in bihar, Train accident in Rohtas district, five dead in train accident, Bihar train accident 5 dead, five ran over by train, Train Accident, Kamhau railway station, Ajmer-Sealdah Express, Mughalsarai railway station, Rohtas train accident

A railway engineer and four contract labourers were run over by a train Saturday when they were repairing the railway track in Bihar’s Rohtas district, police said.

బీహార్ లో విషాదం.. ఐదుగురిపై నుంచి దూసుకెళ్లిన రైలు

Posted: 12/27/2014 06:57 PM IST
Train runs over 5 during track maintenance in bihar

దేశ ఉత్తరాది రాష్ట్రాల్లో కమ్మెసిన పోగమంచు ఐదుగురి ప్రాణాలను కబళించింది. ఉదయాన్నే లేచి విధులకు హాజరైన నలుగురు కూలీలతో పాటు రైల్వే ఇంజనీరును మృత్యు శకటంలా వచ్చిన ఎక్స్ ప్రెస్  రైలు బలి తీసుకుంది. రైల్వే ట్రాక్ మరమ్మతులు చేస్తున్న వారిపై నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకెళ్లిడంతో బీహార్‌లోని ససారం జిల్లాలోని కామౌహు రైల్వే స్టేషన్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూలీల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా శోకసంధ్రంలో మునిగింది.

సీనియర్ సెక్షన్ ఇంజనీరు నాథూ ప్రసాద్ పర్యవేక్షణలో నలుగురు కూలీలు రైల్వే ట్రాక్ మరమ్మతు చేస్తుండగా.. ఆ సమయంలో అజ్మీర్-సీల్దాహ్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న రైలును వారు గుర్తించలేకపోయారు. దీంతో రైలు వారిపై నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు, రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనస్థలానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో గాయపడిని మరో ఇద్దరిని అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Train Accident  Kamhau railway station  Ajmer-Sealdah Express  Mughalsarai  Rohtas  

Other Articles