Telengana government issues orders for construction of christian bhavan for christians with rs 10 crores

Kcr announces christian bhavan, christian bhavan in hyderabad, government constructs christian bhavan, telangana CM announces christian bhavan, government issues orders for christian bhavan, not tolerate attacks on pastors, stern action against attacks on Christians

Telangana Chief Minister K. Chandrasekhar Rao government issue orders for construction of a Christian Bhavan with Rs. 10 crores and assured the Christian community that his government would not tolerate attacks on pastors. He stated that the government would take stern action against those responsible for such attacks.

రూ. 10 కోట్లతో క్రైస్తవ భవన్ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ..

Posted: 12/19/2014 08:31 PM IST
Telengana government issues orders for construction of christian bhavan for christians with rs 10 crores

క్రిస్టియన్ల కోసం హైదరాబాద్ నగరంలో పది కోట్ల రూపాయలతో క్రైస్తవ భవన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్రిస్టియన్లకు నగరంలో ప్రత్యేక భవనం లేదన్న విషయం తమ దృష్టిలో ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంచి ఆర్కిటెక్చర్‌తో అంతర్జాతీయ స్థాయిలో దీని నిర్మాణం ఉంటుందని తెలిపారు. భవన నిర్మాణ బాధ్యతలు పూర్తిగా డిప్యూటీ సీఎం టీ రాజయ్యకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా రెండు రోజులు సెలవులు ఇస్తామని ప్రకటించారు. జనవరి ఒకటిని కూడా సెలవుగా ప్రకటించారు. వచ్చే సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఆ భవన్‌లోనే జరుగుతాయని కేసీఆర్ చెప్పారు. ఈ భవనానికి డిసెంబర్ నెలలోనే శంకుస్థాపన కూడా జరుపుతామని తెలిపారు.

క్రైస్తవులకు ప్రత్యేక బోర్డు కూడా లేదని, త్వరలోనే ఒక బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని పబ్లిక్‌గార్డెన్స్‌లోని లలిత కళాతోరణంలో నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ -2014 వేడుకల్లో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పావురాలు, బెలూన్లు ఎగురవేసి కేక్ కట్‌చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళిత క్రిస్టియన్లను దళితులతో సమానంగా చూస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు ఏ మతం పుచ్చుకున్నా కులం మాత్రం మారదు. కానీ దళితులకు మాత్రం కులం మారుతుంది. దీనికి లాజిక్కే లేదు. కారణం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అన్ని అవకాశాలు హాస్టల్, స్కాలర్‌షిప్ వంటివి కూడా దళిత క్రిస్టియన్లకు అమలు చేస్తాం అని సీఎం చెప్పారు.

విద్యాసంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు అడిగారు.. దీనిపై చర్చించి సానుభూతితో నిర్ణయిస్తాం. 341జీవోలోని రాయితీలు అమలు కావడం లేదని అన్నారు. కలెక్టర్లు, అధికారులకు ఈ జీవో అమలుపై కొత్త ఆదేశాలు జారీ చేస్తాం అని సీఎం హామీ ఇచ్చారు. కొన్ని అసాంఘిక శక్తులు క్రైస్తవ ఫాదర్లు, పాస్టర్స్‌పై దాడులు చేస్తున్నాయి. దీన్ని ఖండిస్తున్నా. దాడులు నియంత్రించాలని ఆదేశాలు ఇచ్చిన. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటివి జరగకూడదు. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులకు సంపూర్ణ రక్షణ ఉంటుంది. దాడి ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. కేసీఆర్ మాట ఇవ్వడు.. ఇస్తే తలతెగి పడినా మాట తప్పడు అని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి క్రిస్మస్ పండుగను క్రిస్టియన్‌లు ఆనందోత్సవాల మధ్య, వైభవంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : christian bhavan  Christians  Christmas 25  KCR  

Other Articles