Don t you feel need to question manmohan singh in coalgate court asks cbi

Manmoham singh, former prime minister, coal blocks, KM Birla, top industrialist, former coal secretary, PC Parakh, Special CBI Judge, Bharat Parashar, examination, coal minister, Hindalci

Don't you feel need to question Manmohan Singh in Coalgate, court asks CBI

బొగ్గు గనుల కేసులో మాజీ ప్రధానిని ప్రశ్నించాలనిపించలేదా..?

Posted: 11/25/2014 06:32 PM IST
Don t you feel need to question manmohan singh in coalgate court asks cbi

2జీ కుంబకోణం కేసు విచారణలో భాగంగా న్యాయస్థానంలో హాజరైన సీబిఐ ఛీప్ రంజిత్ సిన్హా, ఇతర సీబిఐ అధికారులకు సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసిన విషయాన్ని మరువక ముందే మరోమారు సీబీై ప్రత్యేక కోర్టు సీబిఐ పనితీరునై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసులో ప్రధానమైన వారిని ప్రశ్నించాలని మీకు అనిపించలేదా అని నిలదీసింది. న్యాయస్థానం వేసిన ప్రశ్నల ధాటికి సీబిఐ బిక్కముఖం వేయాల్సిన పరిస్థతి ఉత్పన్నమైంది.

మరో వైపు మిస్టర్ క్లీన్ గా ముద్రపడిన భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చుట్టూ బొగ్గు కుంభకోణం కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ గనుల అక్రమ కేటాయింపుల కేసులో మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించాలని మీకు అనిపించలేదా అంటూ సీబీఐ అధికారులను ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. బొగ్గు కుంభకోణం కేసు విచారణ సందర్భంగా సీబిఐని కోర్టు ఈ ప్రశ్న వేసింది. ఈ కేసుకు సంబంధించి బొగ్గు శాణను తన వద్దే పెట్టుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు, బొగ్గు గనుల కేటాయింపులలో పాత్ర వున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త కే.యం బిర్లా, బొగ్గ శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేక్ సహా పలువురిని ప్రశ్నించారా అని ప్రత్యేక న్యాయస్థానం సీబిఐని నిలదీసింది.

కేసు విచారణలో భాగంగా సీబిఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి భరత్ పరస్హర్ సీబిఐపై ప్రశ్నల వర్షం కురిపించారు. బొగ్గు గనుల కేటాయింపులలో అప్పటి బొగ్గు శాఖా మంత్రిని ప్రశ్నించాలని మీకు అనిపించలేదా అంటూ కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ఆయన స్టేట్ మెంట్ చాలా అవసరమని మీకు అనిపించలేదా అని ప్రశ్నించింది. అప్పటి బొగ్గుశాఖా మంత్రి వాంగ్మూలంతో గనుల అక్రమ కేటాయింపులపై స్పష్టత లభిస్తుంది కదా అని కోర్టు పేర్కొంది. అయితే మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్న సయంలో ఆయన కార్యాలయాధికారులను సీబిై విచారించిందని, అప్పటి బొగ్గు శాఖా మంత్రి వాంగ్మూలం అవసరం లేదని నిమ్మకున్నామని, కాగా అప్పటి బొగ్గుశాఖ మంత్రి ప్రధాని కావడం మూలంగా ఆయనను తాము ప్రశ్నించే హక్కు లేదని సీబిఐ దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలిపారు.

బిర్లా గ్రూపుకు చెందిన హిండాల్కోకు గనుల కేటాయింపులు జరిగిన సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖ మంత్రిగా వున్నారు. ఆయన హయాంలోనే హిండాల్కో సంస్థకు ఒడిషాలోని తలబిరా రెండు, మూడు గనుల కేటాయింపులు జరిగాయి. అయితే ఈ మేరకు అప్పటి ప్రధానమంత్రి కార్యాలయ అధికారులను విచారించామని సిబీఐ అధికారి కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు తన ఎదుట బొగ్గు నిక్షేపాలకు సంబంధించిన డైరీని పట్టాలని అదేశించింది. సీల్డు కవర్ లో ఇ:దుకు సంబంధించిన డాక్యుమెంట్లును కోర్టు ఎదుట పెట్టాలని అదేశించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles