India is a key market for singapore says changi airport group officials

India, key market, singapore, changi airport group, officials, changi airport, hyderabad, 1.69 lakh, vice president, robin go, 12 cities, 380 flights

India is a key market for singapore says changi airport group officials

హైదరాబాద్ నుంచే అంత..! మరి ఇండియా నుంచో..

Posted: 11/25/2014 10:19 AM IST
India is a key market for singapore says changi airport group officials

భారత్ తమకు కీలక విఫణి అని సింగపూర్‌కు చెందిన చాంగీ ఎయిర్ పోర్టు గ్రూప్ పేర్కోంది. భారత పర్యాటకులు, వ్యాపార రీత్యా ప్రయాణం చేసే వారికి సింగపూర్ రెండో అతిపెద్ద గమ్యస్థానమని.. అందువల్ల భారత్ తమకు ఎంతో కీలకమైన విపణి అని చాంగీ ఎయిర్‌పోర్ట్ గ్రూప్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) రాబిన్ గో చెప్పారు. భారత్ నుంచి చాంగీ విమానాశ్రయం మీదుగా ఇతర అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు.

ప్రపంచంలో ఆరో అతిపెద్ద రద్దీ విమానాశ్రాన్ని అత్యంత వినోద, సకల సౌకర్యాలు కలిగిన కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని. దీని ద్వారా విమానయాన ప్రయాణికులు ఇక్కడ కొంత సమయాన్ని వెచ్చించే విధంగా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే హైదరాబాద్ నుంచి సింగపూర్ మధ్య రాకపోకలు జరిపిన ప్రయాణికుల సంఖ్య 10.2 శాతం పెరిగి 1.69 లక్షల మందికి చేరినట్లు తెలిపారు. విమానాశ్రయంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న నాలుగో టెర్మినల్ 2017 నాటికి పూర్తవుతుందని, దీనిపై 98.5 కోట్ల సింగపూర్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు.

దీంతో పాటు టెర్మినల్ 1లో 150 కోట్ల సింగపూర్ డాలర్లతో చేపట్టిన 'జువెల్' ప్రాజెక్టు పూర్తయితే.. చాంగీ విమానాశ్రయం వార్షిక రద్దీ సామర్థ్యం 6.6 కోట్ల ప్రయాణికుల నుంచి 8.5 కోట్ల ప్రయాణికులకు పెరుగుతుందన్నారు. హైదరాబాద్ నుంచి సిడ్నీ, మెల్‌బోర్న్, టోక్యో, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి చాంగీ విమానాశ్రయం విమానం మారే (ట్రాన్సిట్) కేంద్రంగా ఉంది. భారత్‌కు చెందిన 12 నగరాల నుంచి 8 విమానయాన కంపెనీలు సింగపూర్‌కు వారానికి 380 ఫ్త్లెట్లను నిర్వహిస్తున్నాయి. అయితే హైదారాబాద్ నుంచే ప్రతీ ఏటా 1. 69 వేల మంది సింగపూర్ కు వెళ్తుంటే.. మరి భారత్ నుంచి ఎందరు వెళ్తున్నారో అంచానా వేసుకోవచ్చు. మరి ఇలాంటప్పుడు మనం వారికి కీలకమేగా..!

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  last places  

Other Articles