Akbaruddin fires on trs behaviour in assembly

trs aimim agreements, trs and aimim friendship, aimim akbaruddin on trs, akbaruddin owaisi on harish rao, akbaruddin comments on trs, telangana government programmes, tdp on trs in assembly, congress leaders on trs in assembly, telangana assembly sessions latest updates, latest telugu updates

akbaruddin fires on trs behaviour in assembly : aimim party assembly leader akbaruddin owaisi fires on trs behaviour in assembly ruling party not co operating with other parties and not fallowing assembly rules and guide lines

టీఆర్ఎస్ కు దూరంగా మజ్లిస్... దోస్తీ కటీఫ్ కు కారణాలేమంటే....

Posted: 11/24/2014 05:06 PM IST
Akbaruddin fires on trs behaviour in assembly

రాజకీయాల్లో ఎవ్వరు ఎప్పుడు శత్రువులు అవుతారో ఎవరు మిత్రులు అవుతారో చెప్పలేము. సమయం, పరిస్థితులను బట్టి అన్ని మారిపోతుంటాయి. తెలంగాణలో కూడా ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. అధికార పక్షంకు దోస్తిగా ఉన్న మజ్లిస్ పార్టి కొద్దిరోజులుగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. అంశాలవారిగా స్పందిస్తున్న ఈ పార్టీ.., కొన్ని విషయాల్లో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగడుతుంది. ప్రతిపక్షంలా సభ నుంచి వాకౌట్ కూడా చేస్తోంది. తాజా దోస్తీ కటీఫ్ పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ ఏర్పడక ముందు పది జిల్లాల ప్రత్యేక రాష్ర్టంను మజ్లిస్ అంగీకరించలేదు. రాయల తెలంగాణ లేదా.., సమైక్య రాష్ర్టం ఉంచాలని కోరింది. అయితే తప్పనిసరి ఇబ్బందికర పరిస్థితుల్లో విభజన ప్రక్రియలో మౌనంగా నిలిచింది. ఇక రాష్ర్టం ఏర్పడ్డ తర్వాత అధికార పక్షంతో దోస్తీ చేసుకుంది. మజ్లీస్, టీఆర్ఎస్ బాయి బాయి అన్నట్లుగా రెండు పార్టీల అధినేతలు వ్యవహరించారు. అసద్ విజ్ఞప్తి మేరకు తెలంగాణ చిహ్నంలో అప్పటివరకు ఉన్న అమరుల స్థూపంను తొలగించి చార్మినార్ ను పెట్టి హైదరాబాదీ నేతలను సంతోషపెట్టారు. గ్రేటర్ పై పట్టు కోసం ఎం.ఐ.ఎం. నేతల ఇంటి చుట్లూ కార్లు చక్కర్లు కొట్టాయి. దీన్ని పాతబస్తీ నేతలు కూడా బాగానే ఉపయోగించుకున్నారు.

అయితే కాలం మారింది. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలన్ని ఒక్కటై ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే మొదట్లో మజ్లిస్ సైలెంట్ గా ఉండేది. అయితే గత వారం నుంచి క్రమంగా వాయిస్ పెంచుకుంటూ వస్తోంది. పద్దతి బాలేదని, వ్యవహారం మార్చుకోవాలని సర్కారుకు మొదట వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు అధికార పక్షంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది. ప్రభుత్వ వైఖరిపై తాను చేసిన ఆరోపణల నిరూపణ కోసం రాజీనామాకైనా సిద్దమని సవాల్ విసిరారు. ఇలా అసెంబ్లీ సమావేశాల పుణ్యమా అని రెండు పార్టీల దోస్తీకి దెబ్బపడుతోంది.

గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలన్ని చూస్తే టీఆర్ఎస్ కు మజ్లిస్ దూరం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. దీనికి ప్రధాన కారణం రాబోయే గ్రేటర్ ఎన్నికలే అని టాక్ విన్పిస్తోంది. ఆ మద్య కార్పోరేషన్ విభజన ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. దీంతో అవగాహనా ఒప్పందం ప్రకారం ఒక కార్పోరేషన్ దక్కించుకునేందుకు రెండు పార్టీలు నీకు నేను నాకు నువ్వు అన్నట్లు వ్యవహరించాయి. అయితే ఇఫ్పుడది జరిగేలా లేదు అని తెలుస్తోంది. దీంతో ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ తో కలిసి పోటి చేస్తే.., అధికార పక్షం లాభపడటం తప్ప తమకు ఏ ప్రయోజనం ఉండదని మజ్లిస్ నేతలు భావిస్తున్నారు.

ఎన్నికల సమయం దగ్గరపడటంతో బీజేపి- టీడీపీ ఒక్కటై కలిసి పోటి చేస్తున్నట్లు ప్రకటించాయి. రాజకీయ పరంగా చూస్తే.., రెండు పార్టీలకు నగరంలో పట్టు ఉంది. కాని నగరంలో బలంగా లేని టీఆర్ఎస్ తో చేతులు కలిపి..., తమ చేతుల్లోని సీట్లు పంచి ఇచ్చి.. ఫలితాలపై ప్రయోగం చేయటం ఎందుకు అనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి తోడు మజ్లిస్ టీఆర్ఎస్ కు మిత్రపక్షం అని ఎప్పుడూ ప్రకటించలేదు. కేవలం అంశాలవారిగా మద్దతు ఇస్తంది. కాబట్టి ఎన్నికల సమయంలో సర్కారుకు వ్యతిరేకంగా ఉంటే కాసిన్ని ఓట్లు ఖాతాలోకి వస్తాయనే ఇలా చేస్తున్నట్లు తెలుస్తంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : trs  akbaruddin  telangana assembly  harish rao  latest news  

Other Articles