Son in law kamil murdered his father in law for property

son in law kamil, son in law murdered father in law ghaziabad, son in law murdered father in law for property, son in law kamil, father in law shakir ali, son in law kamil and his friends, deputy commissioner, deputy commissioner rajendra singh

son in law kamil murdered his father in law for property

ఆస్తికోసం మామను హతమార్చి.. కట్టుకథ అల్లేశాడు!

Posted: 11/20/2014 07:28 PM IST
Son in law kamil murdered his father in law for property

రానురాను సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది... కేవలం డబ్బుకోసం కక్కుర్తిపడి సొంత బంధువులను, తోబుట్టువులనే అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు! కనీస మన కోర్కెలను కూడా సంతృప్తిగా తీర్చని డబ్బులకోసం.. జీవితాంతం సుఖసంతోషాలు పంచుకునేవారిని దూరం చేసుకుంటున్నారు ఆగంతుకులు! ఇటువంటి సంఘటనలు భారతదేశంలో కాలక్రమంలో ఇంకా పెరుగుతున్నాయి కానీ.. తగ్గుముఖం పట్టడం లేదు. ఈ తరహాలోనే తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం తన భార్య తండ్రి (మామ)ని స్నేహితులతో కలిసి దారుణంగా చంపేశాడో అల్లుడు! తర్వాత ఏమీ తెలియనట్టు కట్టుకథ అల్లేశాడు. అయితే పోలీసుల విచారణలో దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే... ఈనెల 15వ తేదీన కమీల్ అనే వ్యక్తి తన మామ షకీర్ అలీని ఎవరో చంపేశారంటూ ఫిర్యాదు చేశాడు. తన మామ షకీర్, స్నేహితుడు అనీస్ లతోపాటు తాను కలిసి షాపింగ్ కు వెళ్లామని.. షాగింప్ ముగిసిన అనంతరం ఘజియాబాద్ నుంచి వస్తుండగా గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్ లపై వచ్చి కాల్పులు జరిపారని తెలిపాడు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన తన మామ షకీర్ అలీని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఆసుపత్రికి వెళ్లేలోపే మరణించాడని పోలీసులకు వివరించాడు. ఎలాగైనా నిందితులను పట్టుకుని, వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులు ముందు దొంగ ఏడుపులు ఏడ్చాడు ఆ అల్లుడు కమీల్!

కమీల్ చేసిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తమదైన రీతిలో విచారణను చేపట్టారు. మొదట్లో వాళ్లకి కాస్త క్లిష్టంగానే అనిపించినా... రానురాను వారి అనుమానాలు నేరుగా అల్లుడిమీదకు వెళ్లాయి. ఘటన జరుగుతున్నప్పుడు అతని మామతోపాటు కమీల్, అతని స్నేహితుడు కూడా అక్కడే వున్నారు. అయితే వాళ్లిద్దరు ఎటువంటి గాయాలు కాలేదు. పైగా సంఘటనాస్థలంలో బైక్ టైరు గుర్తులు కూడా లేవు. దీంతో వారి అనుమానాలు నిజమయ్యాయి. వాళ్లు తమదైన శైలిలో ఎంక్వైరీ చేసి నిజం రాబట్టారు. కేవలం ఆస్తికోసమే తామందరం ఈ హత్య చేశామని నిందితులు అంగీకరించినట్లు డిప్యూటీ కమీషనర్ రాజేంద్ర సింగ్ సాగర్ తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles