Lack of clarity in andhra pradesh dsc notification makes optimistic feel happy and fall in confusion

DSC notification-2014, BED, andhra pradesh, ganta srinivasa rao, Schedule, confussion, TET, DSC, lack of clarity, optimistic, happy, confusion

lack of clarity in Andhra pradesh dsc notification makes optimistic feel happy and fall in confusion

ఆ నోటిఫికేషన్‌తో ఆశావహుల్లో సంతోషం.. గందరగోళం

Posted: 11/20/2014 02:48 PM IST
Lack of clarity in andhra pradesh dsc notification makes optimistic feel happy and fall in confusion

ఎట్టకేలకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో అభ్యర్థుల్లో సంతోషంతో పాటు గందరగోళానికి కూడా దారి తీస్తుంది. డీఎస్సీ పరీక్షలతో పాటు టెట్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్దమైన ప్రభుత్వం.. ఇవాళ వెలువరించిన వివరాలలో స్పష్టత లోపించడంతో ఆశావహులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రేపు విడుదల కానున్న ఢీఎస్సీ నోటిఫికేషన్ కూడా క్లారిటీ లేకుండా వుంటే.. తాము మరోమారు పరీక్షలు రాయాల్సివస్తుందని ఆందోళన చెందుతున్నారు.

మొత్తం 9,061 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ 1,849 పోస్టులు, ఎస్‌జీటీ 6,244 పోస్టులు, లాంగ్వేజ్‌ పండిట్‌ 812 పోస్టులు, పీఈటీ 156 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అర్హత కల్పించడానికి కేంద్రం అనుమతించలేదని, వచ్చే నోనోటిఫికేషన్‌లో అర్హత కల్పించడానికి ప్రయత్నిస్తామని మంత్రి గంటా వెల్లడించారు. 2015 మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుంది. డీఎస్సీ పరీక్షలు, ఎస్జీటీలకు మే 9న, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు మే 10, స్కూల్ అసిస్టెంట్లకు మే 11న పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 2 నుంచి జనవరి 16 వరకు  ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.  ఏపీ ఆన్లైన్, మీ-సేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించవచ్చునని గంటా తెలిపారు.

ఉపాధ్యాయ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ లో షెడ్యూల్ అస్పష్టంగా వుందని అభ్యర్థులు అంటున్నారు. ఢీఎస్సీతో పాటు టెట్ పరీక్షలు కూడా ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల్లో అయోమయానికి గురవుతున్నారు. తాజా డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ తో గతంలో టెట్ అర్హులైన వారు కూడా మరోసారి పరీక్ష రాయాల్సి ఉండటంతో గందరగోళానికి తావిస్తోంది. అయితే టెట్ పరీక్షల్లో వెయిటేజీ ఆధారంగానే డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 దీంతో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన టెట్ పరీక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles