Telangana goernment following ys heritage in defections telangana assembly rocked on the issue

telangana assembly, congress, assembly adjourned, defections, rocked, YS rajashekar reddy, former Cm, heritage

Telangana goernment following YS heritage in defections.? telangana assembly rocked on the issue

వైఎస్ వారసత్వాన్ని కోనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం..?

Posted: 11/20/2014 08:50 AM IST
Telangana goernment following ys heritage in defections telangana assembly rocked on the issue

భారత దేశ 29వ రాష్ట్రంగా అవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తోందా..? అన్న అనుమానాలు ఉదయిస్తున్నాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఓ వైపు జరుగుతుండగానే.. మరోవైపు వైఎస్ వారసత్వాన్ని కొనసాగించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమావేశాల తొలి రోజున సర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ అప్పట్లో అన్న మాటలను ఊటంకించిన ప్రభుత్వం.. అదే ఫార్ములాను అనుసరిస్తుందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పురుడుపోసుకున్న ఉద్యమ పార్టీ ఆ తరువాతి ఎన్నికలలో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ తో జతకట్టి విజయం సాధించింది. ఆ తరువాత ప్రభుత్వంలో కూడా చేరింది. మంత్రి పదవులను కూడా పొందింది. టీఆర్ఎస్ తన జోరు కొనసాగిస్తే.. సమైక్య రాష్టానికి బీటాలు వారుతాయని యోచించిన వైఎస్ టీఆర్ఎస్ ను కట్టడి చేశారు. చాళుక్య రాజనీతి బాగా జీర్ణంచుకున్న ఆయన తనదైన పంథాలో టీఆర్ఎస్ లో చీలిక తీసుకురావడంలోనూ. ఆ పార్టీ చెందిన పలువురు నేతలను కాంగ్రెస్ లో కలుపుకోవడంలోనూ సఫలీకృతుడయ్యాడు.

వైఎస్ హయాంలో టీఆర్ఎస్ తన ప్రభావాన్ని కొంత మేరకు కోల్పోయింది కూడా. తొలిసారిగా జరిగిన ఉప ఎన్నికలలో తన సత్తాను చాటుకున్నా.. రెండవ సారి జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులు పలువురు ఓటమిపాలయ్యారు. అంతేకాదు నిండు శాసనసభలో తెలంగాణకు ఒక్క రూపాయిని కూడా కేటాయించమని వైఎస్ అన్నారు. నాడు టీఆర్ఎస్ ను దెబ్బతీయడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన సఫలీకృతుడయ్యాడు. సెప్టెంబర్ రెండున పావురాల గుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించే వరకు టీఆర్ఎస్ నేతలకు వైఎస్ ఒక రకంగా సింహసప్నం మాదిరిగానే కనిపించాడు. ఆయన మరణానంతరం పార్టీ మళ్లీ పుంజుకుంది. 2009లో టీఆర్ఎస్ అధినేత కేఃసీఆర్ అమరణ దీక్షతో ఉద్యమం ఉదృతంగా సాగింది. కేంద్రమంత్రి చిదంబరం సైతం రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అలా నాలుగేళ్ల పాటు ఉద్యమం ఉదృతంగా సాగిన తరువాత ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

అయితే అప్పడు తమకు జరిగిన అన్యాయాలు, ఇత్యాదులనుబాగానే గుర్తుపెట్టుకున్న టీఆర్ఎస్ ఇప్పడు.. ఆపరేషన్ ఆకర్ష్ ను కొనసాగిస్తోంది. వైఎస్ అనుసరించిన విధానాలను అవలంభిస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. అదేమని అడిగితే.. కాంగ్రెస్ పార్టీయే పిరాయింపులను ప్రోత్సహించిందని ఎదురుదాడికి దిగుతోంది. కొత్త రాష్ట్రం అవిర్భవించిన తరువాత ఏర్పడిన తొలి ప్రభుత్వం అటు రాజకీయ పార్టీలకు, ఇటు ప్రజలకు ఆదర్శంగా వుండాల్సిన అవసరముంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ అన్ని రంగాలలో వెనుకబడిందని, తెలంగాణ సంపన్న రాష్ట్రమని కానీ తెలంగాణ వనరులు దొపిడీకి గురయ్యాయని.. చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త ఆలోచనలు, కొత్త విధానాలను అములు యోచిస్తోంది. పాలనలో కొత్త విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వం.. రాజకీయ పార్టీలతో మాత్రం గత ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలనే అనుసరించడం ఎంత వరకు సమంజసం.

ప్రజల్లో పార్టీ తీరుతెన్నులను, విధానాలను, వైఖరిలను ఎండగడితే.. ఎన్నికల సమయంలో ప్రజలే ఎవరికి పట్టం కట్టాలని నిర్ణయించుకుంటారు. టీడీపీ సమైక్య రాష్ట్ర పార్టీ అని ప్రచారం చేసినా.. గత ఎన్నికలలో ప్రజలు ఆ పార్టీ నేతలను ఎందుకు గెలిపించారు. అయితే గెలిచిన వారిని తమ పార్టీలోకి లాకొవడం సముచితం కాదంటున్నాయి ఇతర పార్టీలు. ఇదే విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కొల్డ్ వార్ నడుస్తుందని కూడా సమాచారం. తమ పార్టీ ఎమ్మెల్యేలను లాకొవడంతో.. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదని.. దరిమిలా ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్ ను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఉత్పన్న అయ్యిందని సమాచారం.

నూతన రాష్ట్రంలో తమదైన మార్కుతో పాటన సాగించాల్సిన తెలంగాణ ప్రభుత్వం.. పార్టీ ఫిరాయింపులు, ఆకర్ష్ పథకాలు అమలు చేయడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలను స్థంభింపజేసే స్థాయికి, శాసనసభ్యులపై సస్పెన్షన్ వేటు వేసే స్థాయికి వెళ్తున్నాయి. ప్రభుత్వానికి మెజారిటీ లేని పక్షంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే.. పరిపాలనా విధానాల్లో భాగంగా తీసుకుంటున్న చర్యలుగా భావించవచ్చునేమో కానీ, సంపూర్ణ మోజారిటీ వున్న తరువాత కూడా ఇలా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే.. విపక్షాల ప్రశ్నలకు బదులివ్వాల్సిందే. ఎవరు ఏక్కడి నుంచి వచ్చారు. ఏ పార్టీలో గెలిచి..ఏ పార్టీలో చేరారన్నది అప్రస్తుతం.. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలకు తిలోదాకాలు ఇచ్చి.. తొలి ప్రభుత్వ మార్కును ఆచంద్రతారార్కం వుండేలా చర్యలు తీసుకోవాలని.. ప్రజల్లోకి ఎలాంటి సందేశం పంపుతున్నామన్నది కూడా ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

 

 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles