Rampal a self styled godman who was once an engineer

Ram singh jatin, doedy junior engineer, Haryana government, non-bailable warrants, pitched battles, security forces, high court directions, popular, lower strata, Controversies, Karontha ashram, Hissar

Rampal.. A self-styled godman who was once an engineer

పోలీసులను గడగడలాడిస్తున్న రాంపాల్.. ఒకనాటి ఇంజనీర్..!

Posted: 11/19/2014 11:00 PM IST
Rampal a self styled godman who was once an engineer

దైవాంశ సంభూతునిగా తనను తాను చెప్పుకొనే వివాదాస్పద స్వామి- రాంపాల్‌ను ఓ హత్య కేసులో భాగంగా అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులను ఆయన శిష్యులు  తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఛండీగడ్ లోని హిస్సార్ లో గల ఆయన ఆశ్రమం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2006 జులై 12న చోటు చేసుకున్న హత్యలో నిందితుడైన రాంపాల్.. విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనపై పంజాబ్-హరియాణా హైకోర్టు మరోసారి నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో హిసార్ జిల్లాలోని బర్వాలాలో ఉన్న సత్‌లోక్ ఆశ్రమం వద్ద జరిగిన ఘటనలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.

నలువైపులా 50 అడుగుల ఎత్తున దుర్భేద్యంగా నిర్మించుకున్న 12 ఎకరాల ఆశ్రమం లోపల దాదాపు 3 వేల మంది రాంపాల్ అనుచరులు మానవ కవచంగా నిల్చోవడంతో పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్వామిని అరెస్టు చేస్తే తాము ప్రాణాలు తీసుకుంటామంటూ కొందరు వంటిపై డీజిల్ పోసుకుని ఆత్మాహుతి దళాలుగా నిలిచారు. ప్రైవేటు సైన్యంగా ఏర్పడిన కొందరు అనుచరులు పిస్తోళ్లు, రివాల్వర్లతో పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆశ్రమగోడను పగులగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా జేసీబీ వాహనానికి దుండగులు నిప్పంటించారు. ఆశ్రమంలో ఎల్పీజీ స్థావరాన్ని పోలీసులు గుర్తించాక మరింత అప్రమత్తంగా పావులు కదిపారు.

 చట్టం నుంచి తప్పించుకునేందుకు దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే రాంపాల్.. ఆయన శిష్యులను రెచ్చగోడుతున్నాయి. దేశ న్యాయవ్యవస్థనే ధిక్కరిస్తూ.. చట్టాన్ని అగౌరవపరుస్తూ, దాడులకు దిగుతూతీవ్రవాదిలా వ్యవహరిస్తున్న స్వామీజీ నిజంగా దైవాంశ సంభూతుడా..? ఇంతకీ ఆయన ఎవరు..? ఎలా దేవుడిగా మారాడు..? ఆయన కోసం ఆయన శిష్యులు ఎందుకు రణరంగాన్ని సృష్టిస్తున్నారు..? తనపై నాన్ బెయిలెబుల్ వారెంట్లు జారీ చేయండని సవాల్ విసిరి.. ఇప్పుడు అరోగ్యం బాగోలేదని చెప్పడానికి కారణమేంటి..?

వివాదాస్పద స్వామీజీగా రికార్డులకెక్కిన రాంపాల్ ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి. హర్యానాలోని ఇరిగేషన్ డిపార్టుమెంటులో జూనియర్ ఇంజనీర్ గా 2000 సంవత్సరం వరకు విధులు నిర్వహించాడు. అయితే ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంలో వ్యవహరిస్తున్న ఈయనను ఉన్నతాధికారులు అనేక పర్యాయాలు మందలించారు. తన ప్రవర్తనను ఏ మాత్రం మార్చుకోని రాంపాల్.. ఇక లాభం లేదని చివరకు 2000 సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో అధికారులు దానిని ఎట్టకేలకు అమోదించారు.

హర్యానా రాష్ట్రంలోని సోనిపాట్ జిల్లా గొహానా పట్టణం సమీపంలోని ధనానాలో సాధరణ రైతు కుటుంబంలో 1951 సెప్టెంబర్ 8న జన్మించారు రాంపాల్. చిన్నప్పుడు చదువుల్లో బాగానే రాణించిన రాంపాల్ ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేసి హర్యానా ప్రభుత్వంలో ఉద్యోగాన్ని సంపాదించారు. అయితే అయనకు చిన్ననాటి నుంచి మతవాది. రాంపాల్ స్వామీజీకి సమాజంలోని బడుగు, దిగువ మధ్యతరగతి ప్రజల్లో చాలా పాపులారిటీ వుంది. అయితే అందరు స్వామీజీల మాదిరగా ఆయన తన భక్తులకు పలు వివాదాస్పద ప్రవచనాలు చేసేవారని కూడా విమర్శలున్నాయి. భగవత్ ఆరాధన, ఉపవాస దీక్షలు, హిందూ మతాన్ని అనుసరించి వుంటే ఇతర మతాలలోకి వెళ్లకూడదని తన భక్తులకు బోధించేవారు.

వివాదాలు, వివాదాస్పద వ్యవహారాలు రాంపాల్ కు కోత్తేమీ కావు. 2006లో రోహ్ తక్ జిల్లాలో జరిగిన మతఘర్షణలకు ఆయన ప్రవచనాలే కారహని తేలింది. దీంతో 1999లో హర్యానాలోని రోహ్ తక్ జిల్లాలోని కొరంత గ్రామంలో స్థాపించిన ఆశ్రమాన్ని 2006లో పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. ఆ ఘర్షణలలో బుల్లెట్ గాయాలు తగిలి ఒక వ్యక్తి మరణించాడు. దీంతో రాంపాల్ పై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అయితే అతని అనుచరులు మాత్రం రాంపాల్ స్వామీజీని అనవసరంగా కేసులో ఇరికించారని అరోపించారు. ఈ కేసు విచారణకు రాంపాల్ హాజరు కాకపోవడంతో పంజాబ్- హర్యానా హైకోర్టు ఇప్పటికే ఆయనపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసింది. నవంబర్ 5, 10, 17 తేదీల్లో కోర్టు హాజరుకాలేదు. నవంబర్ 17న కోర్టు మరోమారు ఎన్బీడబ్యూ జారీచేయగా తనకు అరోగ్యం సరిగా లేదని రాంపాల్ హాజరుకాలేదు. దీనిపై స్పందించిన కోర్టు 21 తేదీన రాంపాల్ ను కోర్టులో హాజరుపర్చాలని కోర్టు పోలీసులను అధేశించింది. హైకోర్టు అదేశాల మేరకు హిస్సార్ లోని రాంపాల్ అశ్రమానికి వెళ్లిన పోలీసులపైనే ఆయన భక్తులు దాడులకు తెగబడుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles