వెదవ జీవితంలో సుఖం లేకుండా పోయింది. రోజు లెగడం.. తయారవ్వడం.. ఆఫీసులకెళ్లడం.. అక్కడ పనులు చూసుకుని ఇంటికి తిరిగిరావడం.. రోటీన్ లైప్.. పరమ బోర్ కొడతోందని నిట్టూరుస్తున్నారా.. ముఖ్యంగా అనేక మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల్లో ఇదే అభిప్రాయం వుంటుంది. కానీ అతడిని చూస్తే.. ఔరా..! అనిపించకమానదు. అతడు మనలానే విసుగు చెందితే.. మనం అతడి గురించి చర్చంచుకునే అవకాశమే ఉండేది కాదు. అతడిని దినచర్యలో భాగమైన ఈ పనిని చూస్తే రోజువారి పనుల, రోటిన్ లైప్ స్టైల్ పై ఎవరికీ విరక్తే రాదు.
అతనే అవతార్ సింగ్ మౌని, పంజాబ్ లోని పాటియాలాకు చెందిన 60 ఏళ్ల వృద్దుడు. ఇతడు సిక్కు మత ప్రబోధకుడు. అయితే.. అతని శిరోభారమే అతనిని గౌరవప్రధమైన ప్రభోధకుడిగా గుర్తింపును తీసుకోచ్చింది. అదేలా అంటారా.. అతని తలపాగా, సిక్కులు ధరించే టర్బన్ ఇందుకు కారణమైంది. ప్రతి రోజుల ఉదయాన్నే లేచి స్నానాదులు అచరించిన తరువాత దాదాపుగా ఆరు గంటల సేపు అతని తయారు కావడానికి తీసుకుంటారు. అంత పెద్దది అతని తలపాగా. సుమారు 645 మీటర్ల పొడుడు, 45 కిలోల బరువు వుంటుందట.
ముందుగా 151 మీటర్ల పొడవు తలపాగాను చుట్టుకున్న ఆయన, ఆ తరువాత దానిని క్రమంగా 250, 365, 645 మీటర్లకు పొడగించారు. అంతేకాదు తన తలపాగా సాధరణంగా వుండటం ఇష్టపడని ఆయన అందులో ఆయుధాలు ఆభరణాలను కూడా పేర్చి సుందరంగా తీర్చిదిద్దుతారు. 45 కిలోల తలపాగ బరువుకు ఇవి మరో 10 కిలోల బరువు అదనంగా వుంటుందట. కేవలం తాను ధరించే తలపాగ ఖరీదు 32 వేల రూపాయల పైచిలుకు అవుతుందని చెబుతున్నాడు. కాగా ఇతను ధరించే తలపాగా చాలా పెద్దదని.. ఇప్పటి వరకు గెన్నిస్ బుక్ లో మేజర్ సింగ్ పేరిట వున్న 400 మీటర్ల పొడవుతో వున్న తలపాగాయే రికార్డు నమోదు ఈయన తలపాగా బరువు లాంబ్లేటర్ వాహనమంత, పొడవు కనీసం 13 ఒలంపిక్ ఈతకోలనులంత వున్నాయి. దీంతో ఈయన పేరిట గెన్నీస్ బుక్ రికార్డు నమోదు చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు పలువురు.
సాధారణంగా సిక్కు మతస్థులు వాడే తలపాగా 16 నుంచి 23 ఫీట్లు వుంటుంది. కానీ వాటిని తోసిరాజని ఏకంగా 645 మీటర్ల తలపాగా చుట్టడమంటే ఎంత కష్టం. తనకు ఒపిక వున్నంత కాలం, తన కాళ్లతో శక్తి వున్నంత వరకు తాను ఈ తలపాగాను ధరిస్తానని గర్వంగా చెబుతున్నాడు అవతార్ సింగ్. ఎప్పుడైన తప్పనిసరి పరిస్థితులల్లో తలపాగా లేకుండా వెళ్లాల్సి వస్తే. తన తల లేదన్న భావన కలుగుతుందంటున్నాడు. తనలోని ఏదో భాగం లేనట్లుగా అనిపిస్తుందని, అది లేకపోవడంతో తాను పడిపోతున్నట్లు కూడా భ్రమ కలుగుతుందని అంటున్నారు. ఇతనితో పాటు ఇతను ధరించిన తలపాగాను చూసేందుకు భక్తలు స్థానికంగా వున్న ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more