Doctor being treated for ebola in omaha dies

Doctor, Treatment, Ebola, Omaha, Dies, Nebraska Medical Center, United States, Sierra Leone, Dr. Martin Salia, critical threshold

Doctor Being Treated for Ebola in Omaha Dies

చికిత్స చేసిన అమెరికా వైద్యుడిని కబళించింది..

Posted: 11/18/2014 12:30 PM IST
Doctor being treated for ebola in omaha dies

ఎబోలా వైరస్ కారణంగా అమెరికాలో మరో వ్యక్తి మృతిచెందాడు. సియెర్ర లియోన్ దేశానికి చెందిన 44 ఏళ్ల మార్టిన్ సాలియా అనే వైద్యుడు అమెరికాలో నివాసం ఉంటున్నాడు. స్వదేశంలో ఎబోలా వ్యాధి సోకిన ఇద్దరు రోగులను వ్యాధి భారి నుంచి చికిత్సనందించి కాపాడిన ఆయనకు వ్యాధి సోకింది. ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న సమయంలో ఆయనకే ఎబోలా వైరస్ సోకడంతో సాలియా అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు వైద్యుల చేసిన చికిత్స పత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయనను చికిత్స నిమిత్తం అమెరికాలోని నెబ్రాస్కా వైద్య కేంద్రానికి తరలించారు.

రెండు వారాల పాటు ఎబోలాతో పోరాడిన ఆయన.. చివరకు చికిత్సపోందుతూ మృతిచెందినట్లు సంబంధిత వైద్య కేంద్రం వైద్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అమెరికాలో ఎబోలా కారణంగా మృతి చెందిన కేసుల్లో ఇది రెండోది. అత్యాధునిక వైద్య, సాంకేతిక పరికరాలు కూడా సాిలియాను కాపాడలేక పోయాయని నెబ్రాస్కా వైద్య కేంద్రం వైద్యులు వెల్లడించారు. సియర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్ లో సాలియా తొలిసారిగా పరీక్షలు చేయించుకున్నప్పటికీ అతిని వ్యాధి సోకలేదని ముందుగా నివేదికలు వెల్లడించాయని, అనుమానం కలిగిన సాలియా..

మరో మారు నవంబర్ 10న పరీక్ష చేయించుకోగా ఎబోలా సోకినట్లుగా నివేదికలో వెల్లడైందని వైద్యులు తెలిపారు. ఇలాంటి పోరబాటు కారణంగానే ఆయన వ్యాధి భారిన పడి తీవ్ర అస్వస్థతకు చేరుకున్నారని తెలిపారు. ఎబోలా వైరస్ సోకడం కారణంగా సాలియా కిడ్నీలు పనిచేయడం ఆగిపోయాయని, శ్వాస తీసుకోవడానికి ఆయన తీవ్రంగా బాధపడ్డారని వైద్యాధికారులు తెలిపారు. ఆయనకు రెండు రకాలుగా వైద్యం చేసినా ఫలితం లేకుండా పోయందని వైద్యులు అవేదన వ్యక్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles