School age students loved and eloped to marry in nainital

minors love, school students love, school students love, students love and escaped to nainital, nainital city tourist places, uttarpradesh famous and tourism places, lovers favourite spots, cute and good love stories, latest love photos and quotes, latest telugu news updates, police counselling methods

school age students loved and eloped to marry in nainital : this is crazy and shocks to listen, a eighth class boy aged 13years old and a girl of 12years old who studying 7th class loved and decides to escape from house. young n minor love pair eloped to marry in nainital but in bareli town police caught them and given counselling to both of minors

ఎంత ఘాటు ప్రేమయో.. ఈ లేత వయసులో....

Posted: 11/18/2014 07:59 AM IST
School age students loved and eloped to marry in nainital

సినిమాలో సమాజం, ముఖ్యంగా యువతపై ఏ మేర ప్రభావం చూపుతాయో తెలిపేందుకు ఇది మంచి ఉదాహరణ. ఈ సంఘటన వినేందుకు నవ్వొస్తున్నా.., యువత సినిమాలు, ప్రేమ వ్యామోహంలో ఏ మేరకు కూరుకుపోతున్నారో ఆలోచిస్తేనే భయమేస్తుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్ లో ఎనమిదవ తరగతి అబ్బాయి, ఏడవ తరగతి అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇక అబ్బయిగారి వయస్సు 13 సంవత్సరాలు.. అమ్మాయి వయస్సు 12 సంవత్సరాలు.

ఏ సినిమాలు చూశారో తెలియదు కానీ, పెద్దలు తమ ప్రేమను అంగీకరించరనీ.., తమ బ్రతుకు తాము బ్రతుకుదామని ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. ఇంకేముంది ఆపరేషన్ ఎస్కేప్ మొదలెట్టారు. తమకు తోచినంతలో పెళ్ళి ప్లాన్ వేసుకున్నారు. చెప్పా పెట్టకుండా ఇద్దరూ ఇంట్లోనుంచి పారిపోయి బయటకు వచ్చారు. నైనిటాల్ వెళ్లి పెళ్లి చేసుకుందామని బయల్దేరారు. మార్గమద్యలో బరేలిలో వారిద్దరూ దిగారు. వీరి కదలికలు అనుమానాస్పదంగా కన్పించటంతో ఓ బ్యాంకు ఉద్యోగి పోలిసులకు సమాచారం ఇచ్చారు.లేత జంట వద్దకు చేరుకున్న ప్రేమికులు వారిని ప్రశ్నించగా అన్ని తలా తోక సంబంధంలేని సమాధానాలు చెప్పారు. గట్టిగా ప్రశ్నించటంతో తమ ఘాటు ప్రేమ విషయం బయటకు చెప్పారు.

వారి మాటలు విన్న పోలిసులు ఆశ్చర్యం వ్యక్తం చేయటంతో పాటు నవ్వుకున్నారు. పోలిస్ స్టేషన్ కు తీసుకెళ్లి.., అబ్బాయి, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ వివరాలు తెలుసుకుని తిరిగి ఇధ్దరిని సొంత ఊరికి పంపించేశారు. ఇదండీ.. లేత వయస్సులో ఘాటు ప్రేమ కధ. సరిగ్గా మీసాలు కూడా రాని అబ్బాయి.., కనీసం స్కూలేజ్ కూడా పూర్తికాకముందే.., ప్రేమసాగరంలో మునిగిపోయి జీవితాన్ని ఈదాలని ఆరాటపడుతున్నాడు. మన సినిమాలు చూసి ఇలా యువతరం చెడిపోతుంది. ప్రేమ కధలకు బదులు.. దేశానికి ఉపయోగపడే మంచి నాయకత్వ, లేదా సైన్యం, క్రీడాకారుల కధలను తీస్తే ఇదే అబ్బాయి ఏ  సైనికుడో.., దేశ నాయకుడో అయ్యేవాడు. కాని మన దర్శక నిర్మాతల నిర్వాకం వల్ల ప్రేమికుడు అయ్యాడు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lovers  nainital  school students love  latest news  

Other Articles