Bhupala pally ap grameena vikas bank 2 branches robbery

bhupala pally grameena bank, ap grameena banks, bhupala pally grameena bank robbery, bank robbery cases, andhra pradesh bank robberies, bank robberies andhra pradeh, telangana bank robberies, different bank robberies

bhupala pally ap grameena vikas bank 2 branches robbery

భారీచోరీ: తాళాలు వేసినట్టేవున్నాయి కానీ 10 కోట్ల సొత్తు మాయం!

Posted: 11/17/2014 07:49 PM IST
Bhupala pally ap grameena vikas bank 2 branches robbery

ఈమధ్య సినిమాల ప్రభావం దొంగలమీద బాగానే పడినట్లుంది... అందుకే ఆ తరహాలోనే తెలివిగా అధికారులకు తెలియకుండా భారీ దొంగతనాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్నే ఉత్తరభారతదేశంలో దాదాపు 125 అడుగులమేర భూమికింద ఒక గుంతతవ్వి, నేరుగా లాకర్లున్న చోటుకే వెళ్లి దొంగతనం చేసిన విషయం తెలిసిందే! ఆ దొంగతనాన్ని ఛేదించలేక పోలీసులు కొట్టుమిట్టాడుతుంటే.. తమను ఎక్కడ పట్టుకుంటారేమోనన్న భయంతో దొంగల్లో ప్రధాన నిందుతుడు కాల్చుకుని చనిపోయాడు. అది వేరే విషయం! తాజాగా వరంగల్ జిల్లా భూపాలపల్లిలో భారీ దొంగతనం జరిగింది. తాళాలు వేసినట్టే వున్నాయి కానీ లాకర్లలోని రూ.10 కోట్ల సొత్తు మొత్తం మాయం!

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని ఏపీ గ్రామీణ వికాస బ్యాంకుకు చెందిన రెండు శాఖల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ప్రధాన ద్వారం తాళాలు వేసినవి వేసినట్టే వున్నాయని.. అయితే లాకర్లలోని బంగారు ఆభరణాలు మాయం అయ్యాయని తెలిపారు. ప్రాథమిక విచారణలో భాగంగా భూపాలపల్లి బ్యాంకులో రూ.17.40 లక్షల నగదు, 16.212 కిలోల బంగారం చోరీకి గురైందని అధికారులు స్పష్టం చేశారు. ఈ చోరీ విలువ మొత్తం రూ.4.54 కోట్లవరకు వుంటుందని వాళ్లు పేర్కొన్నారు. దీంతో ఆ బ్యాంకు అధికారులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. అందులో వున్న ఖాతాదారులో సైతం ఆందోళనల్లో మునిగిపోయారు.

అదేవిధంగా ఆ బ్యాంకుకు చెందిన ఆజంనగర్ శాఖలో కూడా దొంగతనం జరిగింది. అందులో రూ.4.37 కోట్ల నగదు, 18 కిలోల బంగారం చోరీకి గురైందని పేర్కొన్నారు. రెండు బ్యాంకుల్లో మొత్తం కలిసి రూ.10 కోట్ల మేరకు సొత్తు చోరీకి గురైందని డీఎస్పీ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించి విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇదిలావుండగా.. తాళాలు వుండగానే ఒకే బ్యాంకుకు సంబంధించి రెండు శాఖల్లోనూ దోపిడీ జరగంవెనుక బ్యాంకు సిబ్బందిపాత్రగానీ, బ్యాంకు గురించి తెలిసినవాళ్లు ఎవరో చేయించి వుంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhupala pally banks  ap grameena vikas bank robberies  robbery cases  telugu news  

Other Articles