Girl losess patience gives befitting reply to two eve teasers

young girl, lose, patience, dare, eve teasers, harassment, befitting reply

girl losess patience, gives befitting reply to two eve teasers

ఓపిక నశించింది.. చెంప చెల్లుమనింది..

Posted: 11/14/2014 03:56 PM IST
Girl losess patience gives befitting reply to two eve teasers

శాంతి సహనం మన భారతీయులల్లో ఎక్కువగా వున్నాయని ప్రపంచ దేశాలు అంటుంటాయి. అయితే మన దేశంలో ఆడవారికి ఉన్నంత సహనం, ఓర్పులను భూ దేవితో పొలుస్తుంటారు మన పెద్దవాళ్లు. అలాంటిది ఆ యువతి సహనానికి పరీక్ష్ పెట్టారు ఆ యువకులు. అంతే.. సహనం కట్టలు తెంచుకున్న రోజు వారిద్దరి చెంపలు చెల్లమన్నాయి. అంతేకాదు ఆ ఇద్దరు అకతాయిలు ఇప్పుడు కటకటాల్లో వున్నారు. తమ తప్పను మన్నించమని, మరోసారి పునారావృతం కాకుండా చూసుకుంటామని ఆ యువతినే వేడుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.కర్నూలు జిల్లాలో ఓ యువతిని ఇద్దరు అకతాయాలు గత కొంత కాలంగా వేధిస్తున్నారు. అయితే వారు అనే సూటిపోటి మాటలు విని, నిననట్లు నటించి వెళ్లింది. అలా ఒక రోజు, రెండు రోజులు.. ఇక ఆకతాయిలు వెంబడించి మరీ కామెంట్ చేయడం ప్రారంభించారు. తన పనేదో తాను చూసుకుంటు మంచిదనుకుని తలదించుకు వెళ్లింది. అకాతాయిల వెకిలి చేష్టలు, మాటలు శృతిమించడంతో అమె లోని సహనం నశించింది. తలదించుకుందని అబలగా జమకట్టిన ఆ ఆకాతాయిల పాలిట అపరకాళిలా మారింది. ఇద్దరినీ పట్టుకుని వాయించింది. వారి చెంప చెల్లమనింది. దీంతో చుట్టుపక్కలవాళ్లు పోగయ్యారు. ఇంకేముంది వారి సాయంతో వారిని పోలీసులకు అప్పగించింది. సమాచారం అందుకున్న అకతాయిల తల్లిదండ్రలు.. తమ బిడ్లలను మన్నించి వదిలేయమని, మరోసారి ఇలాంటి తప్పులు పునారావృతం కాకుండా చూసుకుంటామని ప్రాధేయపడ్డారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : young girl  lose  patience  dare  answer  eve teasers  harassment  befitting reply  

Other Articles