Us high court gives green light to same sex marriage in kansas

same sex marriages, kansas, USA, courts, in favour of gays, 33 province, US President, BaraK Obama

us high court gives green light to same sex marriage in kansas

అగ్రారాజ్యంలో పిచ్చి ముదిరి పాకానికి చేరుతోందట..

Posted: 11/13/2014 02:58 PM IST
Us high court gives green light to same sex marriage in kansas

శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు లో వైవిద్యలలోనూ అమెరికా అగ్రరాజ్యమే అనిపించుకుంటోంది. అమెరికాలో ఈ మద్య చాలా మందికి పిచ్చి ముదిరి పాకన పడినట్లు వుందట, ప్రకృతి విరుద్దంగా చేసే సంపర్కాలకు అగ్రరాజ్యం సర్గధామంలా అవుతోంది. అసలే తమ వాళ్ల జనాభా తక్కువంటూ ఓ వైపు అవేదన వ్యక్తం చేస్తూనే అసంబద్ద నిర్ణయాలకు పచ్చజెండా ఊపుతోంది. ఏకంగా 33 రాష్ట్రాలలో స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసింది. స్వలింగ సంపర్కులు సంఖ్య పెరుగుతుండటంతో అక్కడి న్యాయస్థానాలు కూడా వారికి అనుకూలంగా తీర్పులను వెలువరిస్తున్నాయి.

తాజాగా, అగ్రరాజ్యంలో పచ్చికాన్సాస్ రాష్ట్రంలో స్వలింగ వివాహాలకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దాంతో అక్కడున్న మొత్తం 50 రాష్ట్రాలలో ఇలా స్వలింగ వివాహాలను ఆమోదించిన 33వ రాష్ట్రంగా నిలిచింది. తమ రాష్ట్రంలో ఇలాంటి పెళ్లిళ్లను ఆమోదించవద్దంటూ అక్కడ కొంతమంది ప్రజలు చేసిన విజ్ఞప్తులను కోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తులలో ఆంటోనిన్ స్కాలియా, క్లారెన్స్ థామస్ అనే ఇద్దరు మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మిగిలిన వాళ్లంతా ఓకే చెప్పారు.

ఆరు రాష్ట్రాల్లో కూడా స్వలింగ వివాహాలను ఆమోదిస్తున్నట్లు అధ్యక్షుడు బరాక్ ఒబామా గత నెలలో ప్రకటించడంతో అప్పటివరకు 26గా ఉన్న ఈ రాష్ట్రాల సంఖ్య 32కు పెరిగింది. ఇప్పుడు కాన్సాస్ 33వ రాష్ట్రం అయ్యింది. త్వరలోనే దక్షిణ కరొలినా రాష్ట్రం కూడా దీన్ని ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. స్వలింగ వివాహాలను రద్దు చేయాలనడం రాజ్యాంగ విరుద్ధమని అక్కడి న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు. దానిపై అప్పీలు జరగనుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : same sex marriages  kansas  USA  courts  in favour of gays  33 province  US President  BaraK Obama  

Other Articles