Philae robotic lander lands on comet 67p churyumov gerasimenko

Philae robotic lander, comet, 67P/Churyumov–Gerasimenko, 4500 million years old, sun, European Space Agency, Rosetta mission, Andrea Accomazzo, google, doodle

Philae robotic lander lands on comet 67P/Churyumov–Gerasimenko

ఖగోళశాస్త్రంలో అద్భుతం.. తోకచుక్కపై ల్యాండైన స్పేస్ షిఫ్..

Posted: 11/13/2014 11:34 AM IST
Philae robotic lander lands on comet 67p churyumov gerasimenko

మానవుడు మళ్లీ చరిత్ర సృష్టించాడు. ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక నూతన అద్యాయానికి పేజీ తెరిచాడు. తొలిసారిగా ఓ తోకచుక్కపై స్పేస్‌క్రాఫ్ట్‌ ల్యాండ్ చేశాడు. తన అపరమేధస్సుతో దానిపైకి దిగాడు. 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి.. విశ్వ రహస్యాన్ని దాచుకుని, ఊహించ లేని ప్రచంఢవేగంతో సూర్యుడి చుట్టూ తిరిగే తోకచుక్కపైకి మానవుడు చేరాడు. అంతరిక్షంలో మానవ మనుగడపై చేస్తున్న పరిశోధనల్లో ఇది మరో మైలురాయిగా నిలిచింది. రెండు మైళ్ల పొడవున్న 67పీ/చుర్యుమోవ్‌-గెరాసిమెంకో అనే తోకచుక్కపైకి యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ‘రొసెట్టా స్పేస్‌క్రాఫ్ట్‌’కు చెందిన ‘ఫిలే లాండర్‌’ దిగ్విజయంగా ల్యాండ్ అయ్యింది.

భారత కాలమానం ప్రకారం నిన్నరాత్రి 9.30 గంటలకు ఈ అద్భతాన్ని అవిష్కరించింది. సరిగ్గా స్పేస్ క్రాప్ట్ నేలను తాకినట్లు ఈఎస్‌ఏ శాస్త్రవేత్తలు తెలిపారు.‘మానవ నాగరికతలోనే ఇది ఓ మైలురాయి’ అని ఈఎస్‌ఏ డైరెక్టర్‌ జనరల్‌ జీన్‌ జాక్వెస్‌ డోర్డెయిన్‌ పేర్కొన్నారు. ఫిలే లాండర్‌.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు రోసెట్టా ఆర్బిటర్‌ నుంచి వేరయింది. ఆ తర్వాత చుర్యుమోవ్‌ను చేరుకోవడానికి ఏడు గంటలు పట్టింది. ఆ సమయంలో ఫిలే దాని చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను నమోదు చేసింది. తోకచుక్కమీదకు దిగే సమయంలో ఫిలే ఫొటోలనూ తీసింది. అయితే ఫిలే.. దాని సమాచారాన్ని నేరుగా భూమికి చేరవేయలేదు. రోసెట్టా ఆర్బిటార్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. దాని నుంచి భూమికి సమాచారం అందుతుంది.

రోసెట్టా దిగ్విజయంగా తొకచుక్కప ల్యాండ్ అయిన సందర్భంగా ఈఎస్ఏ శాస్త్రవేత్తలు సంతోషంలో నిమగ్నమయ్యారు. ఒకరినోకరు హగ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అరుదన ఘట్టానికి తెరతీయడంపై హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాల సర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా ఈ అద్బుతానందాన్ని పంచుకుంది. ఖగోళ శాస్త్రంలో మరో మైలు రాయికి యూరోపియన్ శాస్త్రవేత్తలు తెరతీయడంతో.. గూగూల్.. బహుచక్కని డూడుల్ తో శాస్త్రవేత్తల శ్రమ మాటున దాగివున్నఆనందాన్ని పంచుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles