Bjp searching for a popular leader targets chiranjeevi in making party win in next elections

bjp, popular leader, target, chiranjeevi, MP rajya sabha, in making party win, elections 2019, PM Narendra Modi, Venkaiah naidu, Amit shah

bjp searching for a popular leader, targets chiranjeevi in making party win in next elections

ఏపీలో ప్రజాకర్షణ గల నేత కోసం బీజేపి అన్వేషణ.. చిరుపైనే గురి

Posted: 11/01/2014 09:26 PM IST
Bjp searching for a popular leader targets chiranjeevi in making party win in next elections

ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ బీజేపీ రంగం సిద్దం చేసింది. ముందుగా ప్రజల్లో పరపతి వున్నా నాయకులను తమ పైపు లాగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అవినీతి అరోపణలు లేని స్పచ్చమై నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. ఇప్పటికే పలువురు నేతలను ఆకర్షించిన బీజేపి...ఇప్పుడు టాప్ క్లాస్, బ్రాండ్ ఇమేజ్ వున్న లీడర్ల వేటలో పడింది. ఈ కోవలో ముందుగా బీజేపి నేతలకు కనబడుతున్న నాయకుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి. .రాజకీయాలలో అనుభవరాహిత్యంతో తప్పటడుగులు వేసిన చిరంజీవిని తమ పార్టీవూపు ఆకర్షించుకోవాలని బీజేపీ పార్టీ శ్రేణులు యోచిస్తున్నట్లు సమాచారం.

దొంగల మాదిరిగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్..ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, కాంగ్రెస్ ను ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఎన్నటికీ నమ్మరని, కాంగ్రెస్ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ లో బీజేపి భర్తీ చేసుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపి జాతీయ నేత వెంకయ్యనాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికార మిత్రపక్ష పార్టీని మినహాయించి.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది నేతలు బీజేపిలో చేర్చుకోవడంలో సఫలమయ్యారు. అయితే పార్టీలో చేరిన నేతల్లో కొందరికి జిల్లా వ్యాప్తంగా పట్టుండగా, మరికోందరికి వారి వారి నియోజకవర్గాల వరకు ప్రజామోదం వుంది. ఇప్పుడిదే బీజేపికి సమస్యగా మరింది

రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టు, ప్రజాబలం, ప్రజాకర్షణ కలిగిన నేత కోసం అన్వేషిస్తోంది. అవసరమైతే ఇతర రాష్ట్రాలలో కూడా తమ పార్టీ తరపున ప్రచారం చేయగల సమర్థుడు.. అంతటి ఖ్యాతి వున్న నేత లభిస్తే.. మరో నాలుగున్నర ఏళ్ల తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని గాడిన పెట్టి, అధికారంలోకి తీసుకురాగలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపి శ్రేణుల ముందుకు అనేక మంది నేతల పేర్లు వచ్చాయని, అయితే.. వాటన్నింటినీ పరిశీలిస్తున్న కమిటీ మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని తమ పార్టీలోకి ఆకర్షించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అభిమానుల కోరిక మేరకు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. 2009లో జరిగిన ఉమ్మిడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి పరాభావాన్ని చవిచూసిన చిరంజీవికి.. అప్పట్లో అనుభవ రాహిత్యం డామినేట్ చేసిందని, కానీ ఇప్పుడు చిరంజీవి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా రూపుదిద్దుకున్నారు. అదీగాక రాష్ట్ర విభజన తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా వుంటూ.. అప్పడప్పుడు ఇందిరా భవన్ లోని సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. దీంతె మిస్టర్ క్లీన్ ఇమేజ్ తో పాటు.. ప్రజామోదం కలిగిన నేతగా వున్న చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించి.. బీజేపి కండువా కప్పాలని ఆ పార్టీ శ్రేణులు యోచిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles