Some people eating rat meat gif

rat meat, rat fry, rat curry eating, dishes cooking, food recipie, rat curry recipie, telugu food recipies, latest news, cambodia food, cambodia culture, snakes eating

some people eating rat meat fried and grileld daily : in cambodia people eats rats like meat in martkest of cambodia also many rat dish varities available like grilled rat, fried rat and rat curry

ఎంచక్కా ఎలుకల్ని వేయించుకు తింటున్నారు

Posted: 11/01/2014 10:14 PM IST
Some people eating rat meat gif

పుర్రెకో బుద్ది జీహ్వకో రుచి అన్నారు పెద్దలు. మనలో కొందరు శాఖాహారులుంటారు, మరికొందరు మాంసాహారులు ఉంటారు. ఇంకొందరు రెండు లాగించేస్తారు. శాఖాహారం విషయం కాస్త పక్కనబెట్టేసి మాంసాహారం మ్యాటర్ చూద్దాం. నాన్ వెజ్ లో ఎవరైనా ఏం తింటారు. చికెన్, మటన్, చేపలు, లేదంటే కొన్ని వెరైటీలు కాని ఎవరైనా ఎలుకల్ని తింటారా చెప్పండి. కాని ఇక్కడ మాత్రం ఎలుకల్ని ఎంచక్కా వేయించుకుని తింటున్నారు. ఎలుక ఫ్రై, ఎలుక రోస్ట్, గ్రిల్డ్ ఎలుక, ఎలుక కర్రీ, ఎలుక పులుసు అబ్బో ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి చిట్టెలుకతో చేసే వంటలు.

చదువుతుంటేనే ఎలాగో ఉంది కదా.. కాని ఇవన్నీ నిజంగా మనుషులే తింటున్నారు. అదృష్టవశాత్తు ఇది మన భారత దేశంలో కాదు లెండి.., కాంబోడియా అని ప్రపంచ పటంలో చూస్తే కన్పించే ఓ దేశం. అక్కడ ప్రజలు ఎలుకల్ని మాంసంగా తింటారట. ఎంచక్కా వేయించుకుని మసాలా దట్టించి మరి అమ్ముతున్నారు. అలా అమ్ముతుండగా తీసిందే ఈ ఫొటో. ఇలా ఇంత మొత్తంలో ఎలుకలు ఎక్కడి నుంచి వస్తాయనే సందేహంకు సమాధానం కూడా ఉంది. వియత్నాంలో కొందరు ఎలుకలు ఎక్స్ పోర్ట్ చేయటమే పనిగా పెట్టుకున్నారట. ఒక్కొక్కరు ఒకరోజులో సుమారు ఇరవై ఐదు కేజీల ఎలుకల్ని పట్టుకొచ్చి వ్యాపారస్తులకు అమ్ముతారు. వీరు తిరిగి పెద్ద వ్యాపారస్తులు ఆ తర్వాత మరొకరికి అలా అలా చేతులు మారి చివరకు కాంబొడియాలో ఉన్న కడాయ్ లోకి ఎలుకలు వచ్చి పడుతున్నాయి.

ఇంకో విషయం వీరు అలాంటి ఇలాంటి ఎలుకల్ని తినరండోయ్. కేవలం పొలాల్లో తిరిగే లేదా గింజలను తినే ఎలుకల్ని మాత్రమే తింటారు. ఎందుకంటే ఇవి ఆరోగ్యంగా ఉండటంతో పాటు వీటిలో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయట. బాతులు, చికెన్, ఇతర నాన్ వెజ్ కంటే ఎలుకలు చాలా బాగుంటాయని లొట్టలేసుకుంటు గుటుక్కున మింగేస్తున్నారు వీరేం మనుషులో మరి. అదండీ చైనాలో పాములను పచ్చిగా తిన్నట్లే వీరు ఎలుకల్ని తింటున్నారు. ఈ విషయంలో చైనా వారి కంటే కాంబోడియా ప్రజలు చాలా బెటర్ అని చెప్పాలి. మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి. ఉన్న రోగాలకు తోడు మనకు కొత్తవి రావటం ఖాయం.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rat  food  latest news  cambodia  

Other Articles