Another software engineer bharani missing case

software engineer bharani, telugu software engineer bharani, software woman bharani, bharani missing case, software bharani missing case, bharani latest news, techie bharani missing case, bhavya sri missing case

another software engineer bharani missing case : the software engineer bharani is missing from 26 night when she kept bangalore bus in mgbs bus stop

మిస్సింగ్ : బస్సులో అదృశ్యమైన సాఫ్ట్ వేర్ మహిళ భరణి!

Posted: 11/01/2014 01:55 PM IST
Another software engineer bharani missing case

ఇటీవలే సాఫ్ట్ వేర్ ‘‘భవ్యశ్రీ’’ మిస్సింగ్ మిస్టరీ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే! రెండురోజులపాటు కనిపించకుండాపోయిన ఆమె ఆచూకీని ఎలాగోలా పోలీసులు తెలుసుకోగలిగారు కాబట్టి ఆ కథ అక్కడితో సుఖాంతమయ్యింది. ఇదిలావుండగా.. తాజాగా మరో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భరణి కూడా వున్నట్లుండి అదృశ్యమయ్యింది. బెంగళూరు వెళ్లేందుకు బస్సెక్కిన ఆమె.. ఆ తర్వాత అదృశ్యమైంది.

పోలీసుల కథనం ప్రకారం.. అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన పి.మోహన్ రావు కుమార్తె భరణి (26) కొంతకాలంగా బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కొన్నిరోజులపాటు సెలవులు తీసుకుని ఇంటికి చేరిన భరణి.. తిరిగి ఈనెల 26న బెంగుళూర్ పయనానికి సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలోనే రాత్రి 9 గంటలకు భరణిని ఆమె తండ్రి ఎంజీబీఎస్ లో బెంగుళూర్ వెళ్లే బస్సు ఎక్కించి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకున్న వెంటనే ఆయన భరణికి ఫోన్ చేశారు. అయితే ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. దాంతో ఆందోళనకు గురైన ఆయన అర్థరాత్రివరకు ఫోన్ చేశారు. కానీ ప్రయోజనం మాత్రం లేకపోయింది.

దీంతో మరుసటిరోజు బెంగుళూరులో ఆమె పనిచేసే కంపెనీకి ఫోన్ చేసి తమ కూతురు గురించి వాకబు చేయగా.. భరణి ఇంకా రాలేదని వాళ్లు చెప్పారు. దీంతో నగరంలో వుండే కుటుంబసభ్యులతోపాటు బంధుమిత్రల ఇళ్లలో కూడా ఆమె గురించి ఆరా తీశారు. అయినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో గురువారం రాత్రి అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles