Indian american duo charged in 5 8 million debit card scam

Indian Americans, charge, $5.8 Indian Americans, charge, $5.8 million debit card scam, Philadelphia, arrest, Vijaykumar Patel, Alpeshkumar Patel, FBI, government agents, US Attorney, Paul J. Fishman, prepaid debit cards

Indian American duo charged in $5.8 million debit card scam

అమెరికాలో మోసాలు: ఊచల వెనక్కు ఇద్దరు భారతీయులు

Posted: 10/31/2014 05:43 PM IST
Indian american duo charged in 5 8 million debit card scam

సుమారు ఆరు మిలియన్ డాలర్ల మేర మెసాలకు, కుట్రలకు పాల్పడిన ఇద్దరు భారతీయ సంతతికి చెందిన యువకులను ఎఫ్ఐబి అధికారులు అరెస్టు చేశారు. కుట్రపూరితంగా బాధితుల నుంచి తమ ప్రీపెయిడ్ కార్డులులలోకి డబ్బు జమ చేయించుకని మోసాలకు పాల్పడిన ఇద్దరిని అమెరికా ఎఫ్ బి ఐ అధికారుుల, ప్రభుత్వ ఏజెంట్లు కలసి అరెస్టు చేసినట్లు అమెరికా అటర్నీ పాల్ జె ఫిష్ మాన్ వెల్లడించారు. అల్పేష్ కుమార్ పటేల్ (30) విజయ్ కుమార్ పటేల్ (39)లు కలసి కుట్రలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు.

ఫిలడెల్ఫియాలో నివసించే విజయ్ కుమార్ పటేల్ నివాసంలో మోసాలకు పాల్పడుతుండగా వీరిని అరెస్టు చేశారు. మోసం, కుట్ర ఇత్యాదులకు పాల్పడిన వీరికి సుమారుగా 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు రెండు లక్షల యాభై వేల మిలియన్ డాలర్ల మేర జరిమానా కూడా విధించవచ్చని తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ మాసం నుంచి ఈ ఏడాది మార్చి వరకు వీరు కుట్రపూరితంగా మోసం చేసి సుమారుగా 5.8 మిలియన్ డాలర్ల డబ్బును ఆర్జించారని అభియోగాలు నమోదయ్యాయి.

గుర్తు తెలియని అగంతకుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో తాము డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని ఎఫ్ ఐ బికి పిర్యాదులు వెల్లువెత్తడంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. న్యూజెర్సీలోని రిటైల్ షాపులో బాంబు వుందని, ఐదు నిమిషాల్లో అది పెలుతుందని, దానిని తొలగించాలంటే తక్షణం తమ ప్రీపెయిడ్ డెబిట్ కార్డులోకి డబ్బును పంపాలని డిమాండ్ చేశారు. అప్పటికే కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ఎఫ్ బి ఐ సదరు దుకాణానికి వెళ్లి డబ్బును వేయవద్దని కోరారు. ఆ ఫోన్ ఎవరు చేశారన్న విషయంపై ఆరా తీయడంతో పాటు సదరు డెబిట్ కార్డు అకౌంట్ ఎవరిదన్న విషయంపై కూపీ లాగారు. దీంతో అది ఫిలబోల్పియాలోని విజయ్ కుమార్ పటేల్ అని నిర్ధారించుకున్న ఎఫ్ బి ఐ ఆయన నివాసానికి వెళ్లి అతనితో పాటు అల్పేష్ కుమార్ పటేల్ కూడా అదుపులోకి తీసుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles