Modern slavery in bangladesh

balngladesh people, bangladesh people problems, bangladesh human traffickers, bangladesh poeple works, bangladesh country growth, world latest news, india bangladesh bifurication, bangladesh labour, modern slavery in bangladesh

Modern Slavery in Bangladesh : with their family problems bangladeshi people ready to work in other countrie which they even dont know the name also. human traffickers drags labour into boats and forces to work them without money

విదేశాల్లో ఉపాధి పేరుతో మోసపోతున్నారిలా....

Posted: 11/01/2014 01:10 AM IST
Modern slavery in bangladesh

స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా బంగ్లాదేశీయుల కష్టాలు మాత్రం తీరటం లేదు. పేద, మద్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉన్న దేశంలో ప్రజలు ఉపాధికోసం అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తాజా సర్వేలు చెప్తున్నాయి. బంగ్లా ప్రజలు కేవలం సంపాదన కోసమే పనులు చేయకుండా., పూట గడవటం కోసం కొందరు చేస్తే.., కనీసం తిండి పెడతారని మరికొందరు కష్టపడుతున్నారు. ఇంకొందరయితే పనిచేస్తే ఆ ప్రదేశంలో ఉండవచ్చు అనే కారణంతో కూడా ఒళ్ళు వంచి పని చేస్తున్నవారు చాలామంది ఉండటం బాధాకరం. ఇక రోజుకు ఎనమిది గంటల పని అనేది వీరి జీవితంలో తెలియని మాట. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు లేదా యజమాని వెళ్ళిపొమ్మని చెప్పేవరకు పనిచేయటమే వీరికి తెలుసు.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక విదేశాల్లో ఉపాధి కోసం వెళ్ళి మోసపోవటం మరో బాధాకర అంశం. పని దొరుకుతుంది అనగానే సంతోషంతో ముందు వెనకా ఆలోచించకుండా వెంటనే బయల్దేరుతున్న బంగ్లా ప్రజలు తీరా విదేశాలకు వెళ్ళాక దారుణంగా మోసపోతున్నారు. ప్రధానంగా థాయ్ లాండ్ లో కొందరు మానవ అక్రమ రవాణా ముఠాలు బంగ్లా ప్రజలకు పని ఇప్పిస్తామని నమ్మబలికి అక్రమ రవాణా చేస్తున్నాయి. ఇలా వచ్చిన వారిని చిత్రహింసలు పెడుతూ.., బానిసల్లా పనిచేయించుకుంటున్నారు. ఇంత చేసినా వారికి సరైన వేతనం, సౌకర్యాలు అందుతున్నాయా అంటే అదీ లేదు. తినటానికి తిండి కూడా సరిగా ఉండదని పలువురు బాధితులు వెల్లడిస్తున్నారు.

మరొక విషయం ఏమిటంటే.., కొందరు ప్రజలయితే ఎక్కడకు వెళ్తున్నారో కూడా తెలియకుండా బో్ట్లు ఎక్కేస్తున్నారు. థాయ్ లాండ్ లో తాము ఏం పని చేయాలి.. ఎంత వేతనం ఇస్తారు ఇవేవి పట్టించుకోకుండి పని దొరుకుతుంది అనే కారణంతో తమ కుటుంబం బాగుపడుతుంది అనే కలతో ప్రయాణం అవుతున్నారు. ఇక వీరి కుటుంబాలు కూడా దేశంలో మామూలుగా ఉండటం లేదు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరయినా పని చేయాల్సిందే. బాలకార్మికులు కూడా దేశంలో ఎక్కువే. మిలియన్ల సంఖ్యలో బంగ్గాలో బాల కార్మికులు ఉన్నారట. ఇలా జరగటానికి బంగ్లా ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శలు వస్తున్నాయి. అక్రమార్కులను కఠినంగా శిక్షిస్తే ఇలా అక్రమ రవాణా చేసేవారికి ఏజంట్లు సహకరించరు అని చెప్తున్నారు. మన నుంచి వేరుపడిన ఈ సోదర దేశం.., కష్టాలు త్వరలో తీరాలని కోరుకుందాం.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangladesh  slavery  thailand  latest news  

Other Articles