Police lock on kiss of love protest

kochi, Kiss Day, Kerala police, Kiss of Love

Police lock on ‘Kiss of Love’ protest

ప్రేమికుల ‘ముద్దు ఉద్యమా’నికి.. పోలీసుల బ్రేకులు..

Posted: 10/30/2014 03:53 PM IST
Police lock on kiss of love protest

సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో కొత్త ఉద్యమం తెరపైకి వచ్చింది. నైతిక పోలీసు వ్యవస్థతో వచ్చిన ఇబ్బందులకు నిరసనగా కేరళలోని ప్రేమికులు ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నారు. నవంబర్ 2న కేరళలో ప్రేమ ముద్దు పేరుతో కొత్త ఉద్యమానికి తేరతీశారు. బీజేపి శ్రేణులు, కార్యకర్తలు, పార్టీకి అనుబంధంగా వున్న యువమోర్చ సంఘాలు సంయుక్తంగా కేరళలోని ప్రేమికులపై దాడులకు పాల్పడుతుండటాన్ని అక్కడి యువత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నైతిక పోలీసుల పేరుతో బీజేపి శ్రేణులు ప్రేమికులపై దాడులకు పాల్పడటం హేయకరమైన చర్యగా వారు అభివర్ణిస్తున్నారు.

ఈ నెల 23న  కొజికోడ్ జిల్లాలో బీజేపి సంఘాలు సంయుక్తంగా చేసిన దాడిలో భారీ విధ్వంసాన్ని సృష్టించారు. దీనిని ప్రత్యక్షంగా ప్రసారం చేసి కేరళలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన జైహింద్ ఛానెల్.. బీజేపి శ్రేణులు అనైతిక చర్యలను తీవ్రంగా ఖండించింది. బీజేపి, యువమోర్చాలు సంయుక్తంగా కలసి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని వివరించింది. జరిగిన ఘటనప చర్చాగోష్టులు, ఇతర కార్యక్రమాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో కేరళ యువత కూడా ముందుకు వచ్చింది. ప్రేమికులకు వ్యతిరేకంగా, ప్రేమ జంటలపై దాడులకు నిరసనగా ఉద్యమాన్ని నిర్వహించాలని యువత నిర్ణయించారు.

ఈ తరుణంలో తమకు అందివచ్చిన సాంకేతిక విప్లవ మార్గం ఫేస్ బుక్ ద్వారా నవంబర్ 2న ప్రేమకు ముద్దు పేరుతో ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంతే అది దవానంలా వ్యాపించింది. ఇప్పటికే తాము ఉద్యమానికి కదలివస్తున్నట్లు సుమారు ఐదు వేల మంది ప్రేమికులు అంగీకారం తెలుపుతూ ముందుకు వచ్చారట. కొచ్చిలోని మెరైన్ డైవ్లో నిర్వహించే ఈ ఉద్యమానికి పోలీసులు మాత్రం అనుమతిని నిరాకరించారు. యువత ప్రేమ ముద్దు ఉద్యమంతో స్థానికంగా శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చునని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అనుమతిని నిరాకరించినా.. తమ ఉద్యమం కొనసాగుతుందని, షార్ట్ ఫిల్మ్ నిర్మాత రాహుల్ పసుపలన్ అన్నారు. ఈ ఉద్యమానికి అందరూ ఆహ్వానితులేనన్న ఆయన.. ముద్దు పెట్టడానికి అమ్మాయిని మాత్రం వారే తెచ్చుకోవాలని చమత్కరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kochi  Kiss Day  Kerala police  Kiss of Love  

Other Articles