ప్రపంచమంతా ఒక కుగ్రామంలా మారిపోయి ఎల్లలు చెరిగిపోయిన ప్రస్తుత యుగంలోనూ వేర్పాటువాదాలు..., విభజన సిద్దాంతాలు పెచ్చుమీరుతున్నాయి. కుల, మత, వర్గ, భాష, ప్రాంతాలుగా విభజనలు వస్తున్నాయి. ఇలా ఏ పేరున విభజన వచ్చినా వాటిలో అంతరార్థం అధికారమే ఉంటుంది. తాజాగా ఇస్లామిక్ స్టేట్ సంస్థ చేసిన ‘కాలిఫేట్’ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. సిరియా, ఇరాక్ దేశాలను ఒకే కాలిఫేట్ గా విస్తరిస్తూ అబూ బక్రల్ -బాగ్ధాదీ అనే అనే ఇస్లామిక్ గురువు ఈ ప్రకటన చేశాడు. ఇస్లామిక్ రాజ్యాలకు ఇస్లామిక్ స్టేట్ తనను తాను ‘కాలిపేట్’గా ప్రకటించుకోవటంతో పాటు కాలిప్ గా అబూ బక్రల్ -బాగ్ధాదీ ను ప్రకటించింది. ఇలా చేయటం వల్ల తమ ఉన్మాదాన్ని గొప్పదిగా చెప్పుకోవటంతో పాటు క్రూరాలను సమర్ధించుకుంటోంది. ఈ కాలిపేట్ ను ప్రతి ముస్లిం కూడా మత విశ్వాసంగా భావించాలని ఆయన ప్రకటించారు.
అయితే ఈ ప్రకటన వచ్చిన వెంటనే తూర్పు మద్య దేశాలన్నీ ఈ విధానాన్ని ఖండించాయి. తమకు ఈ వ్యవస్థ అవసరం లేదు అని ప్రకటించాయి. బక్రల్ చేసిన ప్రకటన వెనుక ఉన్న క్రూరత్వాన్ని గ్రహించిన దేశాలు తాము ఈ పాపంలో భాగస్వాములం కాలేము అని స్పష్టం చేశాయి. అయితే ముస్లిం మతం ప్రపంచంలోనే శక్తివంతమైనదిగా మారాలన్న కోరిక దీనివైపు కొందర్ని ఆకర్షితుల్ని చేస్తోంది. ఇది చాల భయంకరమైన పరిణామంగా చెప్పవచ్చు.
అసలేమిటి ‘కాలిఫేట్’....?
సాధారణ... మన దేశంలో ముస్లింలకు తెలిసిన సమాచారం ప్రకారం.. కాలిపేట్ అనేది ఒకరకమైన రాచరికపు పాలన అని చెప్పవచ్చు. పూర్వం ముస్లిం రాజులు, దేశాన్ని పాలించిన వ్యక్తులు సామ్రాజ్యాలను కాలిఫేట్ లుగా అభివర్ణించేవారు. వాటిని చూసుకునే వారిని ఖలీఫా అని సంబోధించేవారు. ఒక కాలిపేట్ లో ఉన్న ప్రజలందరికి ఖలీపా చెప్పేది వేదవాక్కు. వారు ఏం చెప్తే అది చేయాలి... ప్రభువులు చెప్పిన ఆచారాలు, సాంప్రదాయాలు పాటించాలి అన్నమాట. అలా చాలాకాలం క్రితం ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ కాలిపేట్ వ్యవస్థలు ఉండేవి. 90సంవత్సరాల క్రితమే టర్కీలో చివరి కాలిఫేట్ వ్యవస్థ అయిన ఓట్టమన్స్ (ఉస్మానియా) సామ్రాజ్యం ముగిసి పోయింది. ప్రస్తుతం టర్కీ ప్రపంచ దేశాల మాదిరిగా నడుచుకుంటోంది.
ఇప్పటికీ ముస్లింలకు కాలిపేట్ కాంక్ష
ఈ వ్యవస్థ చాలాకాలం క్రితమే రద్దు అయింది. కొన్ని చోట్ల నిర్మూలించబడింది. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ వ్యవస్థ కనుమరుగయిపోయింది. అయితే నాటి వ్యవస్థలు ఇప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఈజిప్టు, మొరాకో, ఇండోనేషియా, పాకిస్థాన్ సహా ఇతర ముస్లిం ప్రభావిత దేశాల్లో మూడింట రెండు వంతుల మంది కోరుకుంటున్నారు. ఇస్లామిక్ దేశాలన్ని కలిసి ఉంటేనే బాగుంటుంది అని వీరు అభిప్రాయపడుతున్నారు. వినటానికి ఇది ఐకమత్య సూచకంగా.. చాలా బాగున్నా, దీని వెనక ఉన్న అసలు అర్ధం భయాందోళనలు కల్గిస్తుంది.
632వ సంవత్సరంలో మహ్మద్ ప్రవక్త తర్వాత రషీదున్ కాలిపేట్ గా వ్యవహరించారు. వీరీ ఆధీనంలో నలుగురు గురువులు సామ్రాజ్యాన్ని నడిపించారు. అలా ముప్పై ఏళ్ళ పాటు ఇస్లామిక్ వ్యవస్థ నడిచింది. ఇక్కడీ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే.. ప్రవక్త తర్వాత వచ్చిన వ్యక్తులు కలిఫాలుగా వ్యవహరించారు. వీరు అంతా వారి ఆచారాలు, మత విశ్వాసాలు, నమ్మకం, వ్యవహార శైలి, మతం పట్ల గౌరవం, అంతకుమించి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను సేకరించి ఎంపిక చేసిన వ్యక్తులు. వీరు ముస్లింల కోసం చట్టాలు చేయగలరు కానీ.. చట్టానికి మాత్రం అతీతులు కాదు. కానీ ప్రస్తుతం కాలిపేట్ కోరుకుంటున్న వ్యక్తుల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు.
ఇంకో విషయం ఏమిటంటే ఈ కాలిపేట్ వ్యవస్థలను అప్పట్లో కూడా ముస్లింలోని ఒక వర్గం వ్యతిరేకించింది. ముస్లింలలోని షియా వర్గం కాలిపేట్ పై ఆసక్తి చూపలేదు. అయితే సున్ని వర్గ వ్యక్తులు మాత్రం ఇప్పటికి ఇలాంటి నిరంకుశ్వ విధానాల మద్యే జీవిస్తున్నారు.
మహ్మద్ ప్రవక్త కాలానంతరం డెబ్బయి సంవత్సరాల తర్వాత ముస్లిం సామ్రాజ్యం క్రమంగా ప్రపంచంలోని ప్రాంతాలకు విస్తరించింది. అలా స్పెయిన్, మొరాకో, దక్షిణాసియా, పాకిస్థాన్ దేశాలకు విస్తరించింది. అలా మొత్తం ప్రపంచంలో ముస్లిం దేశాలు అవతరించాయి. అయితే మొదట్లో వీరందరికి ఒకే నాయకత్వం, ఒకే నాయకుడు ఉండేవారు. కాని క్రమంగా అనేక పరిణామాల కారణంగా ఈ వ్యవస్థలు అన్ని దేశాల్లో కనుమరుగవుతూ వచ్చాయి. అలా అన్ని దేశాల్లో కాలిఫేట్ వ్యవస్థలు రద్దు అయినా.., అక్కడక్కడా కొందరు వ్యక్తులు మాత్రం కలీఫా హోదాలో ఆదేశాలు జారీ చేసేవారు, నిర్ణయాలు తీసుకుని అమలు పరిచేవారు.
ఆ తర్వాత 20వ శతాబ్దం మద్య కాలంలో సెక్యులర్ కాలిఫేట్ వ్యవస్థ ప్రచారంలోకి వచ్చింది. అలాంటిదే ఈ భావనను పాన్ అరబిజంగా వ్యవహరించారు. 1950లో నాసర్ తీసుకువచ్చిన యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ వాదన ఇందుకు ఉత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే మధ్య, ఆసియా దేశాల్లో ఆ సమయంలో వచ్చిన పలు కారణాలతో ఇది అంతగా ప్రచారంలోకి రాలేకపోయింది. అయితే కాలిఫేట్ ను నడిపించేందుకు అర్హత కల సరైన వ్యక్తులు లేకపోవటం వల్లే ఈ వ్యవస్థలను ప్రజలు పక్కనబెట్టారని తెలుస్తోంది.
ఇక ఈ మద్య జరిగిన విషయాలనే తీసుకుంటే టునిషియా, ఈజిప్టు, లిబియా వంటి దేశాల్లో స్వాతంత్ర్య కాంక్ష లక్ష్యంగా ప్రజలు పోరాటాలు చేసి విజయం సాధించారు. అయితే వాటి ఫలాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మాత్రం ఎంతో కాలం నిలబడలేదు. ఈజిప్టునే తీసుకుంటే..., ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తర్వాత ముస్లిం బ్రదర్ హుడ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వాన్ని చేసిన ఆర్మీ... దేశాన్ని బలవంతంగా నడిపిస్తోంది. కొందరు ప్రజలు ఆర్మీకి మద్దతు ఇస్తే మరికొందరు మోర్సికి అనుకూలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇది రాజకీయ సమస్య కావచ్చు. కాని నాయకత్వంపై ప్రజల్లో ఒకప్పుడు ఏకాభిప్రాయం ఉంటే.. ఇప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పేందుకు ఈ ఘటన ఉదాహరణ. ఇందువల్లే కాలిఫేట్ వ్యవస్థలు కొనసాగటం లేదు.
కాని ఈ మద్య బక్రల్ ప్రకటనతో మళ్లీ కాలిఫేట్ వ్యవహారం ప్రస్తావనకు వస్తోంది. ముస్లింలందరూ ఒకే గొడుగుకిందకు వచ్చి... ముస్లిం రాజ్యాలన్ని ఒకే విధానంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్తున్నారు. దీని వల్ల తమ మతాభివృధ్ధి జరగటంతో పాటు.. ముస్లింల ఐక్యత పెరుగుతుంది అని కొందరు ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సామ్రాజ్యవాద, అధికార కాంక్ష పెరిగి... వివాదాలు, ప్రపంచ విపత్తులకు కూడా కారణం అయ్యే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.
మరొక విషయం ఏమిటంటే ఇది ముస్లింల లోని ఒక వర్గం ప్రజలు మాత్రమే ఒప్పుకుంటున్న విధానం. మరొక విధానం పాటించే ముస్లింలు ఖలీఫాలను కోరుకోవటం లేదు. కాబట్టి ఐక్యంగా ఉన్న ముస్లిం వర్గం వారిపై ఆదిపత్య దాడులు చేయవచ్చు. ఇదే జరిగితే ప్రపంచం అతి భయంకర పరిస్థితులను చూడాల్సి ఉంటుంది. అటు ముస్లిం శక్తి మంచి పని కోసం ఏకమైతే తప్పు లేదు కానీ.. తామొక శక్తిగా శాసించాలన్న కోరికతో ఒక్కటయితే మాత్రం ప్రపంచ దేశాలకు ఇదో సవాల్ గా మారుతుంది. పేరులో ఉన్న ఐక్యత, శక్తి, మతవాదంలు చూసి ప్రజలు ఈ వ్యవస్థలను కోరుకుంటారో... లేక ప్రజాస్వామ్య, వ్యక్తిగత స్వేచ్చా విధానాలు పాటిస్తారో చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more