Ysr congress party office changes to vijayawada

ysr congress office, ysr congress office in vijayawada, ysr congress programmes, ysr congress mla mp list, vijayasai reddy, ap capital vijayawada, vijayawada latest news, andhrapradesh latest news, vijayawada autonagar

ysr congress party office changes to vijayawada : ysr congress central office will change to vijayawada says party leader vijayasai reddy, he says in hyderabad a branch office for telangana will work. ysr congress is the first party to move its office to andhrapradesh capital while rest of all working with hyderabad and using ap office as vijayawada party offices

ఆటోనగర్ సాక్షిలో.., వైసీపీ అడ్డా

Posted: 10/27/2014 10:45 AM IST
Ysr congress party office changes to vijayawada

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చిరునామా మారనుంది. ఒక్క చిరునామా ఏమిటి.., ఏకంగా పార్టీ కార్యాలయం ఊరు.., రాష్ర్టమే మారిపోనుంది. ఏపీ రాజధాని విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి.., జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి స్వయంగా విజయవాడలో ఈ విషయం వెల్లడించారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యాలయం కోసం సరైన స్థలం అన్వేషణలో నేతలు ఉన్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

స్థలం ఖాయం అయితే వెంటనే పార్టీ కార్యాలయ పనులు జరుగుతాయని చెప్తున్నారు. అటు నగరంలోని ఆటో నగర్ లో సుమారు మూడు ఎకరాల స్థలంలో సాక్షి కార్యాలయం ఉంది. దీన్ని వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్చాలని పార్టీ నేతలు పలువురు సూచిస్తున్నారు. ఈ స్థలం అయితే అన్నివిధాలా బాగుంటుందని చెప్తున్నారు. ఈ స్థలాన్ని పార్టీ కార్యాలయంగా మారిస్తే సాక్షి కార్యాలయం ఎక్కడ పెట్టాలని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భవనం లోనే ప్రత్యేకంగా రెండు లేదా మూడు అంతస్థులు సాక్షికి అప్పగిస్తే సరి అని కొందరు సలహా ఇస్తున్నారు. లేదంటే... మంగళగిరికి తరలించే అవకాశం ఉందంటున్నారు.

విభజన తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ర్టాలుగా ఏర్పడినా.., పార్టీ కార్యాలయాలు మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నాయి. విజయవాడను రాజధానిగా ప్రకటించినా.. స్థల ఎంపిక సమస్య పరిష్కారం కాకపోవటంతో పార్టీ కార్యాలయాల మార్పు జరగలేదు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న పార్టీ నగర, జిల్లా కార్యాలయాలనే ఆయా పార్టీలు ఏపీ ఆఫీసులుగా తాత్కాలికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంను విజయవాడకు మారుస్తున్న తొలి పార్టీగా వైసీపీ నిలిచింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysr congress  vijayawada  party office  latest updates  

Other Articles