Curiosity rover sends crocodile photo on mars

crocodiles on mars, crocodiles attacks, crocodiles photos, nasa curiosity rover latest updates, curiosity crorodile photo, nasa rover, mars orbiter mission, mars orbiter mission latest updates, mom on mars, latest science news, astrology

curiosity rover sends crocodile photo on mars : nasa curiosity rover sends a photo that shows shape of crocodile and scientists says its shaped with dust, stones, snow fall on mars surface no identical details about crocodiles on mars

మార్స్ పై మొసలి ఫొటో తీసిన క్యూరియాసిటి

Posted: 10/21/2014 05:54 PM IST
Curiosity rover sends crocodile photo on mars

అంగారక గ్రహంపైకి వెళ్ళిన ఉపగ్రహాలు ఆశ్చర్యకరమైన ఫొటోలు పంపుతున్నాయి. నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై తిరుగుతూ.., పనిలో పనిగా ఓ మొసలి ఫొటో తీసి పంపింది. మొసలి అంటే నిజమైన ముసలి కాదు లెండి.. అలాంటి రూపం. అంగారకుడి ఉపరితలంపై ఈ ఆకారం గుర్తించిన రోవర్... తనలోని అత్యాధునిక కెమెరాతో ఫోటో తీసి నాసాకు పంపింది. ఈ ఫోటోను పరిశీలించిన అమెరికా అంతరిక్ష సంస్థ ఇది అచ్చం మొసలి లాగానే ఉంది అని చెప్పారు. అయితే ఇది మొసలి లేదా మరో జంతువు రూపం అని మాత్రం దృవీకరించలేదు.

ఈ ఆకారాన్ని పరిశీలించిన కొందరు ఖగోళ శాస్ర్తవేత్తలు.., గ్రహంపై రాళ్ళు, ధూళికి మంచు చేరటం వల్ల ఇలా ఏర్పడి ఉండవచ్చు అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం అంగారకుడిపై జీవం ఆనవాళ్ళు ఉన్నాయి అనేందుకు ఇది ఒక ఆధారం అని చెప్తున్నారు. దీనిపై నాసా మాత్రం ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. భూమికి ప్రత్యామ్నయ గ్రహంగా భావిస్తున్న అంగారకుడిపై జీవం ఉనికి, భవిష్యత్ లో జీవం మనుగడ అవకాశాల కోసం పరిశోధనలు చేసేందుకు అమెరికా క్యూరియాసిటీ రోవర్ పంపింది.

అటు భారత్ కూడా ‘మామ్ (మార్స్ ఆర్బిటర్ మిషన్)’ను అంగారకుడిపైకి పంపి పరిశోధనలు చేస్తుంది. ప్రపంచంలో అంగారకుడిపైకి ఉపగ్రహం పంపిన అగ్రదేశాల సరసన భారత్ చేరింది. అటు ఆసియా ఖండంలోనే మొదటి దేశంగా నిలిచింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : curiosity  crocodile  nasa  latest updates  

Other Articles