Power cut problems in telangana state becoming major issue to cm kcr

telangana state, telangana cm kcr, kcr news, kcr latest news, kcr press meet, kcr updates, kcr telangana, telangana farmers, telangana farmers suicide, telangana loan weaver, power cut problems telangana, telangana power cut problems, telangana tdp party, telangana congress party

power cut problems in telangana state becoming major issue to cm kcr which can raise the doubts against him

సీఎం కేసీఆర్ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు!

Posted: 10/17/2014 09:45 PM IST
Power cut problems in telangana state becoming major issue to cm kcr

విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సమస్యలు ఏర్పడిన విషయం తెలిసిందే! ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గురించి మాట్లాడితే... మొదట నుంచి ఎన్నో ఇబ్బందులు ఆ రాష్ట్రాన్ని వెంటాడుతూనే వున్నాయి. అయినా కేసీఆర్ తనదైన తెలివితో రాష్ట్రాభివృద్ధికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తీవ్ర విద్యుత్ సంక్షోభం మాత్రం ఆయనకు పెద్ద సమస్యగా మారిపోయింది. రాష్ట్రం ఏర్పడిన మొదటినుంచి ఇప్పటివరకు విద్యుత్ సంక్షోభ సమస్యను మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోతోంది. అసలు ఆ సమస్య నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభత్వానిది! ఎంత ధర చెల్లించయినా విద్యుత్ ను కొందామని కేసీఆర్ భావిస్తే... అమ్మేవారు మాత్రం అస్సలు కనిపించకపోవడంతో ఏం చేయాలో తోచక అయోమయంలో మునిగిపోయారు. ఒకవేళ ఎక్కడైనా విద్యుత్ దొరికినా.. అక్కడి నుంచి తరలించడం చాలా కష్టం! మొత్తానికి విద్యుత్ కొరత తెలంగాణ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టేస్తోంది.

మరోవైపు విద్యుత్ సంక్షోభం కారణంతో తెలంగాణ రాష్ట్రంలో పంటలు చాలావరకు దెబ్బతినడంతో అప్పులపాలైన రైతులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. తమకు కనీస ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిందేనంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నా... విద్యుత్ లభించకపోవడంతో ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. దీంతో తీవ్ర అసహనానికి గురవుతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే 250పైగా రైతులు మరణిస్తే.. తాజాగా ఒక్క గురువారం రోజే మరో ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ముగ్గురు రైతులు సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలోనే వుండటం సంచలనంగా మారిపోయింది. ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడం కారణంగానే రైతులు ఇలా ఒక్కొక్కరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే విద్యుత్ సంక్షోభంతో సతమతమవుతున్న తెలంగాణ సర్కారుకు.. వరుసగా రైతులు బలవన్మరాలకు పాల్పడటం కేసీఆర్ కు పెద్ద శాపంగా మారే వీలుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రైతులు కూడా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి ఇన్నాళ్లయినా ఇంకా విద్యుత్ సంక్షోభ సమస్యను ఎందుకు తీర్చడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వీరికితోడు తెలంగాణాలో వున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు విద్యుత్ సమస్యకు, రైతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే కారణమంటూ తేల్చి చెబుతూ ప్రచారాలు చేస్తున్నారు. రైతులు ఇలాగే ఆత్మహత్యలు చేసుకుంటే... తెలంగాణాలో ఆయన మీద వ్యతిరేకత వ్యక్తమవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి.. ఎట్టిపరిస్థితుల్లోనూ కేసీఆర్ విద్యుత్ సంక్షోభ సమస్యను పరిష్కరించి, రైతులు భరోసా ఇవ్వడంలో సఫలం అయితే మంచిదని... లేకపోతే అవి ఆయనకు శాపంగా మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles