Bjp leader subramania swamy responce on sc granting bail to jayalalithaa in assets case

Jayalalithaa, AIADMK, Karnataka High Court, parappana special court, paper book, 6 weeks, bail, supreme court, subramania swamy, BJP

Bjp leader subramania swamy responce on SC granting bail to Jayalalithaa in assets case

జయలలిత బెయిల్.. వెనుక షరతులూ వున్నాయ్..

Posted: 10/17/2014 03:11 PM IST
Bjp leader subramania swamy responce on sc granting bail to jayalalithaa in assets case

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు షరతులతో కూడిన సాధారణ బెయిల్ నే సుప్రీంకోర్టు మంజూరు చేసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. అందుకనే తానూ బెయిల్ పై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. కోర్టు జయలలితకు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో జయ తరపున ఫాలీ నారిమన్ వాదనలు వినిపించారని తెలిపారు. జయకు, ఆమె సహచరులకు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలా? వద్దా? అనే విషయంపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దాదాపు 35వేల పత్రాలను డిసెంబర్ 18లోగా కర్ణాటక హైకోర్టుకు సమర్పించాలని, అలా చేయకపోతే జయలలిత బెయిల్ రద్దవుతుందని స్వామి వివరించారు.

బెయిల్ కూడా ఆ తేదీ వరకే అమల్లో ఉంటుందన్నారు. ఆ తర్వాత ఆమెకు బెయిల్ పై కర్ణాటక హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చని సుబ్రమణ్యస్వామి తెలిపారు. అంతేగాక, కర్ణాటక హైకోర్టు విచారణపై ఎలాంటి వాయిదా కోరకూడదన్నారు. జయలలిత వయస్సు, అనారోగ్య కారణాల వల్లే అత్యున్నత న్యాయాస్థానం బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. ఢిసెంబర్ 18 వరకు ఆమె ఇంట్లోనే ఉండాలని, ఈ సమయంలో ఎవరితోనూ సంప్రదించడం కానీ, కలవడం కానీ చేయరాదని కోర్టు షరతులు విధించినట్లు ఆయన వెల్లడించారు.

అటు, బెయిల్ ఇచ్చాక తమిళనాడులో ఎలాంటి హింస జరగబోదని, జడ్జిల గురించిగానీ, వేరెవరిగురించి గానీ వ్యాఖ్యలు చేయబోరని నారిమన్ కోర్టుకు హామీ ఇచ్చినట్లు స్వామి పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటన జరిగినా, తనపై దాడి జరిగిందని సుబ్రహ్మణ్య స్వామి చెప్పినా వెంటనే బెయిల్ రద్దవుతుందని కోర్టు చెప్పిందని సుబ్రహ్మణ్య స్వామి వివరించారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles