Pslv c26 successfully launched in the early hours

srihari kota, PSLV c-26, countdown, Isro, satish dhavan space center, success, RadhaKrishnan, satillite

PSLV-C26 successfully Launched in the Early Hours

నిశిరాత్రి నింగిలోకి.. పీఎస్ఎల్వీ, ప్రయోగం సక్సెస్.!

Posted: 10/16/2014 08:44 AM IST
Pslv c26 successfully launched in the early hours


పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ26 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముతూ రాకెట్ సగర్వంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది. ఆకాశంలో ఉరుములు.. మెరుపులు వున్నా.. మన శాస్త్రవేత్తలు మొక్కవోని ధైర్యంతో పీఎస్ఎల్వీ- సీ 26ను విజయవంతంగా నింగిలోకి పంపారు. అశాకం మేఘావృతం కావడంతో ఉదయం 5.30 గంటలకు మొదటి ప్రయోగ వేదికపై పీఎస్ఎల్‌వీ వాహకనౌకతో ఉండిన మొబైల్ సర్వీసు టవర్‌ను వెనక్కు పంపి, పీఎస్ఎల్‌వీ-సి26లో ద్రవ ఇంధనం నింపాల్సి ఉంది. వర్షం, ఉరుములు, మెరుపులు తగ్గిన తర్వాత ఉదయం 8.30 గంటల సమయంలో మొబైల్ సర్వీసు టవర్‌ను రాకెట్ నుంచి వేరుచేసి, వెనక్కు పంపారు. అనంతరం మూడు గంటల అలస్యంగా పీఎస్ఎల్‌వీ వాహకనౌకలో ద్రవ ఇంధనం నింపారు. సాధారణంగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం సమయంలో 58 గంటల పాటు కౌంట్‌డౌన్ బదులు పీఎస్ఎల్‌వీ-సీ26కు మాత్రం 67 గంటలు కౌంట్‌డౌన్ నిర్వహించారు.

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను ఈనెల పదో తేదీన నింగిలోకి పంపాలని నిర్ణయించినా.. సాంకేతిక లోపం తలెత్తడంతో వాయిదా వేశారు. పీఎస్ఎల్‌వీలోని సాంకేతిక లోపంపై అధ్యయనం చేసిన వీఎస్ఎస్‌సీ డీడీ మూకయ్య కమిటీ సూచనల మేరకు నాల్గో దశలోని హీట్‌షీల్డ్‌ను రాకెట్ నుంచి విడదీసి ఎక్విప్మెంట్‌బేలో కొత్త ఉపకరణాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించి, ప్రయోగానికి సిద్ధం చేశారు. అంతలో మరో లోపం తలెత్తగా దానిని చిదంబరం కమిటీ సరిచేసింది. అన్నీ పూర్తిచేసుకుని ప్రయోగానికి సిద్దంగా వుండగా హుద్‌హుద్ తుపాను ప్రభావం వెంటాడింది. చివరకు దాని ప్రభావం నెల్లూరు జిల్లా వైపు లేకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు వూపిరి పీల్చుకున్నారు.

అన్ని అడ్డంకులనూ అధికమించి పీఎస్ఎల్‌వీ-సీ26కు ఈ నెల 13వ తేదీ నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. చివరకు శాస్త్రవేత్తలు నిర్ణయించిన మేరకు ఇవాళ తెల్లవారుజామున 1.32 గంటలకు వాహకనౌక చిమ్మ చీకట్లో నింగివైపు తారాజువ్వలా రివ్వున దూసుకెళ్లింది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేవు. పరస్పరాభినందనలు, అలింగనాలతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సంతోషకర వాతావరణాన్ని సంతరించుకుంది. మరో విజయాన్ని తన రికార్డుల్లో పదిలం చేసుకుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srihari kota  PSLV c-26  countdown  Isro  satish dhavan space center  success  RadhaKrishnan  satillite  

Other Articles