Delhi high court slams chautala over his traipsing

om prakash chautala, haryana, delhi high court

delhi high court slams chautala over his traipsing, rejects bail

ఎన్నికలు తెచ్చిన ఇబ్బందులంటే ఇవేనేమో..!

Posted: 10/10/2014 07:11 PM IST
Delhi high court slams chautala over his traipsing

రాజకీయ నాయకులకు పదవిలో ఉన్నా.. లేకున్నా.. ఎన్నికలు వస్తున్నాయన్నా ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అదే కోర్టులు, అరెస్టులు అనేసరికి మాత్రం ఉన్నట్టుండి ఆస్పత్రిలో చేరిపోతారు. హర్యానాకు చెందిన కురువృద్ధ నాయకుడు ఓం ప్రకాష్ చౌతాలా (79) విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ుమారుగా 80 ఏళ్ల ఈయనకు హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఇబ్బందులనే తెచ్చిపెట్టాయి. వచ్చేవారం ఎన్నికలు ఉండటంతో ఆయన ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. చురుగ్గా తిరుగుతున్నారు. అయితే, మరోవైపు ఆరోగ్యం బాగోలేదంటూ బెయిల్ ఇప్పించాలని కోర్టును కోరారు. దాంతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు ఆగ్రహం వచ్చింది. మేదాంత మెడిసిటీ ఆస్పత్రి నుంచి అసలు బయటకు ఎందుకు వెళ్లారో వివరించాలని ఢిల్లీ హైకోర్టు ఆయనను ఆదేశించింది.

1999 నాటి టీచర్ల నియామకంలో అవినీతి కేసులో చౌతాలాకు పదేళ్ల జైలుశిక్ష పడింది. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద విడుదలై ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో, బెయిల్ రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును సీబీఐ కోరింది. ఈ విషయం న్యాయస్థానం దృష్టికి రావడంతో తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది.. ఆయన అంతలా రాజకీయ సమావేశాల్లో పాల్గొంటుంటే, సీబీఐ ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని సీబీఐతో పాటు అస్పత్రి వైద్యులను న్యాయస్థానం ప్రశ్నించారు. చౌతాలా తమ వద్దకు సీబీఐ కస్టడీలో రాలేదని, మామూలు పేషెంటుగానే వచ్చారని, అలా వచ్చినవాళ్లు వెళ్లిపోతామంటే తాము బలవంతంగా అట్టిపెట్టుకోలేమని మేదాంత మెడిసిటీ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ నరేష్ ట్రెహాన్ చెప్పారు.

దీంతో చౌతాల బెయిల్ ను రద్దు చేసిన న్యాయస్థానం అతడిని రేపు కోర్టులో లోంగిపోవాలని ఆదేశించింది. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మే నెలలో మంజూరైన బెయిలు న్యాయమూర్తి రద్దుచేశారు. ఇక మీదట ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని, బెయిలు రద్దు చేస్తున్నందున జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో గత ఏడాది జనవరిలో ఓంప్రకాశ్ చౌతాలాతోపాటు ఆయన కొడుకు అజయ్, మరో 8 మందికి పదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : om prakash chautala  haryana  delhi high court  

Other Articles