Syria islamic state militants beheads british hostage

beheading, IS terrorists, siria, Britain

syria Islamic State militants beheads british hostage

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మరోమారు ఘాతుకం..

Posted: 10/05/2014 11:45 AM IST
Syria islamic state militants beheads british hostage

ఇరాక్, సిరియాల్లో మారణహోమం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. తమ వద్ద బందీగా ఉన్న బ్రిటన్ పౌరుడు అలన్ హెన్నింగ్ తలను నరికేశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోను ఇంటర్నెట్‌లో ఉంచారు. ఇంతకుముందు మరో ముగ్గురిని ఇలాగే తలనరికేశారు. ఆ దారుణాలను కూడా వీడియోలో చూపారు. పీటర్ కస్సైగ్ అనే అమెరికన్‌ను బెదిరిస్తూ వీడియోను ముగించారు.

సిరియాలో వైమానిక దాడులను ప్రారంభించిన అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామాను హెచ్చరిస్తూ.. ఈ చర్యలను మానుకోవాలని సూచించారు. ద్రోణి దాడులు తమ ప్రజలపై విరుచుకుపడుతున్నాయని.. అందువల్ల వారు బ్రిటెన్ పౌరుల పీకలపై విరుచుకుపడుతున్నామని ఓ ఉగ్రవాది చెప్పాడు. పీటర్.. ఉగ్రవాదుల చెరలోనే ఉన్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి కైట్లిన్ హేడన్ ధ్రువీకరించారు. ఆ వీడియోను విశ్వసించకపోవడానికి కారణాలేమీ లేవని తెలిపారు. పీటర్‌ను విడిపించడానికి దౌత్య, సైనిక, నిఘా, చట్టబద్ధ సంస్థలను ఉపయోగించనున్నట్లు తెలిపారు.

మరోపక్క వీడియో వాస్తవికతపై పరిశీలన జరుపుతున్నట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అది నిజమే అయితే ఇది మరో దారుణమైన హత్య. హెన్నింగ్ కుటుంబానికి అన్ని రకాల సాయాలను అందిస్తామని చెప్పారు. ఈ ఉగ్రవాదులు ఎంత పాశవికంగా వ్యవహరిస్తున్నారో ఈ హత్య స్పష్టంచేస్తోందని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ వ్యాఖ్యానించారు. ఇరాక్, సిరియాల్లో భూభాగాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆక్రమించుకున్నారు. వీరిపై అమెరికా దళాలు వైమానిక దాడులు చేపడుతున్నాయి. బ్రిటన్ ఇందుకు తోడ్పాటును అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశాల పౌరులను లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beheading  IS terrorists  siria  Britain  

Other Articles