R krishnaiah condemns chandrababu decission

r krishnaiah, r krishnaiah wiki, r krishnaiah latest, r krishnaiah news, bc krishnaiah, r krishnaiah mla, lb nagar, telangana mla list, hyderabad mla list, telangana, telangana assembly, telangana news, latest news, kcr, andhrapradesh, chandrababu naidu, andhrapradesh government, adarsha raitu

tdp mla r krishnaiah condemned chandrababu naidu decission to remove adarsha raitu in andhrapradesh : r krishnaiah fires on chandrababu for removing adarsha raitu concept from andhrapradesh

ధర్నాలో బాబుకు వార్నింగ్ ఇచ్చిన కృష్ణయ్య

Posted: 09/26/2014 05:57 PM IST
R krishnaiah condemns chandrababu decission

బీసీ సంఘం అధ్యక్షుడు, టీడీపీ నేత ఆర్.కృష్ణయ్య మరోసారి చంద్రబాబుపై విమర్శల పర్వం కొనసాగించారు. పార్టీ తరపున గెలిచి ఎమ్మెల్యే అయినా, ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న కృష్ణయ్య.., బాబు టార్గెట్ గా ప్రసంగాలు చేస్తున్నారు. తాజాగా ఆదర్శ రైతుల తొలగింపుపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో జరిగిన ధర్నా కార్యక్రమంలో కృష్ణయ్య పాల్గొన్నారు. బాబుపై అసలే కోపంగా ఉన్న కృష్ణన్న టైం వచ్చింది కదా అని.., మైకు అందుకుని విమర్శలు మొదలు పెట్టారు.

ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేయాలన్న చంద్రబాబు నిర్ణయం సరికాదన్నారు. పధకంలో లోపాలు ఉంటే సరిచేయాలి తప్ప.., ఏకంగా వ్యవస్థను రద్దు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎవరికి ఉపాధి లేకుండా చేయటం బాబకు న్యాయం కాదన్నారు. భవిష్యత్ లో కూడా ఇలాగే వ్యవహరిస్తే రైతులు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదర్శ రైతుల విషయంలో తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు లబ్ది కలుగుతుందనే భావనతో ఈ వ్యవస్థను తొలగించటం వల్ల రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేక భావన కలుగుతుందన్నారు.

ఈ ధర్నాలో పాల్గొన్న కృష్ణయ్య ఏపీ ప్రభుత్వం లక్ష్యంగానే ఎక్కువగా విమర్శలు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేయటంతో.., వారిని కూడా తప్పుబట్టాలి కాబట్టి.., ఓ మాట అనాలి అనే విధంగా కేసీఆర్ నిర్ణయంపై స్పందించారు. తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించబడ్డ కృష్ణయ్య పార్టీ తెలంగాణలో ఆశించిన స్థానాల్లో గెలవక పోవటంతో.., శాసనసభా పక్ష నేత పదవిని ఆశించారు. అయితే ఈపదవిని బాబు ఇవ్వకపోవటంతో అసంతృప్తి పెంచుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకర్తలతో కాకుండా తన అనుచరులతో మాత్రమే కలిసి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆర్. కృష్ణయ్య ఎమ్మెల్యేగా కంటే, ఉద్యమ సంస్థ నేతగానే ఉండేందుకు ఇష్టపడుతున్నారు.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : r krishnaiah  latest news  andhrapradesh  chandrababu  

Other Articles