Kcr government responsible for power crisis

telangana state, Power problem, nagam janardhan reddy, KCR

KCR government responsible for power crisis, has no future plans

ప్రభుత్వానికి ముందుచూపు లేక విద్యుత్ సమస్య

Posted: 09/26/2014 08:16 AM IST
Kcr government responsible for power crisis

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చడానికి అధికారంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని బీజేపి సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. ప్రజలు రోజురోజుకు విద్యత్ కోతలతో అల్లాడుతున్నా సమస్య పరి ష్కారానికి ప్రభుత్వం ఎలాం టి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి తగ్గడంతో కోతలు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన తప్పబట్టారు. ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేయూలనే ఆలోచన రాకపోవడమే ఇందుకు కారణమన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కాలనే ఆలోచన  ముఖ్యమంత్రి చేయడంలేదన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
 
ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయూలని నాగం జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్ణీత గడువును ప్రకటిస్తూ గ్రామాల్లో దండోరా వేయించాలన్నారు. లేని పక్షంలో అమాయక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.  ప్రతి కుటుంబం బ్యాంకుల్లో ఖాతా తెరిచి జన్‌ధన్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  

విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వర్తింప చేయడంపై కేసీఆర్ ప్రకటించిన స్థానికత పలువురికి ఇబ్బందులు కలిగించేలా ఉందని నాగం పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా అన్ని ప్రాంతాలకు చెందిన వారు హైద్రాబాద్‌లో నివాసం ఏర్పరచుకున్నారన్నారు. అయితే ప్రతి విద్యార్థి స్థానికతను రుజువు చేసుకుంటేనే రీయంబర్స్‌మెంట్‌ చెల్లిస్తామనడం దారుణమన్నారు. 17 సెప్టెంబర్‌ను విమోచనదినంగా జరపాలని గత ప్రభుత్వాలను కోరిన కేసీఆర్ తన హయంలో ఎందుకు నిర్వహించలేదో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకం కాదన్నారు. కేసీఆర్ కేవలం ఓట్లకోసమే ఎంఐఎంకు అన్ని విధాలా సహకరిస్తున్నారని నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana state  Power problem  nagam janardhan reddy  KCR  

Other Articles