Cell phones prisoners shifted to warangal chanchalguda jail

Cherlapally jail, Cell phones, ganja seized, warangal jail, veeraswamy, Chanchalguda, officers, check

cell phones prisoners shifted to warangal, few to chanchalguda jail

చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్నారు..

Posted: 09/25/2014 12:50 PM IST
Cell phones prisoners shifted to warangal chanchalguda jail

చర్లపల్లి జైలు అధికారులు ఆలస్యంగా నిద్రలేచారు. తమ జైలులో ఖైదీలు సెల్ ఫోన్లు వాడుతున్నారన్న మీడియా కథనాలతో నిద్ర లేచిన అధికారు ముందుగా ముగ్గురు అధికారులపై వేటు వేశారు. ఇక తాపీగా ఖైదీల వంతుకు వచ్చారు. అనేక పర్యాయాలు ఇలాంటి కథనాలు వెలుగు చూసినా.. ప్పందించని అధికారులు.. ఇఫ్పుడు మాత్రం గట్టిగానే చర్యలకు ఉపక్రమించారు. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో పోలీసింగ్ విధానాన్ని తీసుకువస్తామన్న తెలంగాణ  ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో కూడా మార్పు రాని చర్లపల్లి అధికారులు.. అసలేం జరుగుతుందన్న విషయాన్ని స్వయంగా ఖైదీలే చెప్పిన కథనాలతో వారిలో కదలిక వచ్చింది.

మానసిక పరివర్తన, తప్పు చేశామన్న భావన, తమ వారికి దూరంగా వున్నామన్న మనోవేధనతో మార్ప కోసం విధించే జైలు శిక్షను హ్యాపీగా వున్నాం. జల్సా చేస్తున్నాం అన్నట్టుగా మార్చివేశారు ఆ ఖైదీలు. తాజాగా మీడియాతో వారు సాగించిన ఫోన్ సంభాషనలే ఇందుకు నిదర్శనం. ఇకనేం వారిపై కఠిన చర్యలు తీసకునేందుకు చర్లపల్లి సెంట్రల్ అధికారులు ఉపక్రమించారు. జైల్లో సెల్ఫోన్లు వాడిన వ్యవహారం దుమారం రేపడంతో.. ఖైదీలపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్న అధికారులు.. ఇక ఖైదీలపై కన్నెర చేశారు.

జైలులో జల్సా చేస్తున్నాం అన్నట్టు వ్యవహరించి.. సెల్ఫోన్లు వాడిన 12మంది ఖైదీలకు ఇకపై క్షమాభిక్షతో పాటు ములాఖత్లను కట్ చేశారు.  మొత్తం 12మంది ఖైదీలలో ఆరుగురిని చంచల్ గూడకు తరలించిన అధికారులు, మరో ఆరుగురిని వరంగల్ జైలుకు తరలించారు. చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ వీరస్వామి.. న్యాయవాదికి ఫోన్ చేసి... తనకు బెయిల్ ఇప్పించాలంటూ కోరడం సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో గత అర్థరాత్రి జైలు సిబ్బంది సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు వారి కార్యాలయాలకు పరిమితం కాకుండా, క్రమంగా ఖైదీలను తనిఖీ చేస్తే.. జైలులో శిక్ష్ అనుభవించడానికి వచ్చామన్న భావన ఖైదీలలో కలుగుతుందేమో...


 జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cherlapally jail  Cell phones  ganja  seized  warangal jail  Chanchalguda  officers  check  

Other Articles