America schools to teach telugu

telugu, telugu language, telugu words meanings, telugu dictionary, telugu vyakaranam, telugu chandassu, telugu kathalu, telugu school girls, telugu students, america, education in america, schools in colifornia, latest news, manabadi, manabadi books, us news, telugu updates, world languages

schools in colifornia state of america agreed to teach telugu as the world language on students choice : with the help of siliconandhra and manabadi telugu become recognised language in colifornia state schools students may choose language on their own choice

తెలుగు ప్రపంచ భాషగా అమెరికా గుర్తింపు

Posted: 09/25/2014 11:23 AM IST
America schools to teach telugu

‘తేనె పలుకుల తెలుగు’కు మరో వెలుగు వచ్చింది. తెలుగు రాష్ర్టాల్లోనే బాషపై దాడి జరిగి.., సొంత బిడ్డలు మాట్లాడటం మర్చిపోతుంటే... అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా మన బాషను మెచ్చుకుంది. తెలుగు ప్రపంచ బాషల్లో ఒకటిగా గుర్తించింది. అంతేకాదు కాలిఫోర్నియాలోని స్కూళ్ళలో ఇకపై తెలుగును కూడా విద్యార్థులకు నేర్పిస్తారు. ఇందుకోసం సిలికానాంధ్ర, మనబడి విశేషంగా కృషి చేశాయి. తెలుగు ప్రొఫెసర్లను కలిసి.., విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా పుస్తకాలు తయరు చేయించారు. ఈ పుస్తకాలను ఫ్రెమెంట్ యునిఫైడ్ స్కూల్ డిస్ర్టిక్ట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆమోదించింది.

రెండు సంస్థల కష్టం ఫలితంగా తెలుగును స్కూళ్ళలో భోధించేందుకు కాలిఫఓర్నియా రాష్ర్టంలో ఒక స్కూల్ డిస్ర్టిక్ట్ అంగీకరించింది. ఇకపై పాఠశాలలో ప్రపంచ బాషల్లో భాగంగా తెలుగును ఎంపిక చేసుకునే విద్యార్థులకు బాషను బోధిస్తారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును చెప్తారు. అమెరికాలో ఉన్న చాలామంది తెలుగువారు.., తమ పిల్లలు స్కూళ్లలో చేరిన సమయంలో విదేశీ బాషలను ఎంచుకుని ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు బాష లేకపోవటంతో జాబితాలోని ఇతర ప్రపంచ బాషలను ఎంపిక చేసుకుని వాటిని చదవాల్సి వచ్చేదని.. అయితే ఇప్పుడు మాత్రం ఆ ఇబ్బంది ఉండదని చెప్తున్నారు.

మాతృబాష అయిన తెలుగును నేర్చుకోవటం వల్ల.. తెలుగు జాతి సంస్కృతి పిల్లలకు తెలియటంతో పాటు., బాష గొప్పతనం తెలుసుకుంటారని అమెరికాలోని తెలుగువారు అంటున్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో తెలుగు మాట్లాడితే కొట్టే  విద్యార్థులను శిక్షించే పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. అమ్మ అంటే వారికి ఆగ్రహం వస్తుంది.., మమ్మి అనే వరకు మండే ఎండలో నిలబెట్టి దండిస్తారు. ఇలాంటి వారికి కాలిఫొర్నియా నిర్ణయం చురుకులా అంటుకుంటుంది. ప్రియురాలిపై మోజుతో తల్లిని వదిలేసినట్లు.., పరబాష ప్రభావంలో మనవారు మాతృబాషను మర్చిపోతున్నారు. ఇప్పటికైనా వారు మారితే., తెలుగు తల్లి సంతోషిస్తుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu  colifornia  manabadi  america schools  

Other Articles