Dinesh reddy gif

dinesh reddy, dinesh reddy case, dinesh reddy assets, cbi on dinesh reddy, dinesh reddy vs cm kiran, dinesh reddy on telangana, dinesh reddy assets case, supreme court, cbi, cbi jobs, cbi cases, cbi court, supreme court judgement

ex dgp dinesh reddy disapproriate of assets case was written off by supreme court : dinesh reddy got relief as apex court given judgement by written off his case and orders to close

కోర్టు తీర్పుతో పండగ చేసుకుంటున్న దినేష్ రెడ్డి

Posted: 09/15/2014 08:42 PM IST
Dinesh reddy gif

ఉమ్మడి రాష్ర్ట మాజి డీజీపి దినేష్ రెడ్డికి సుప్రీంకోర్టు పండగచేసుకునే విషయం వెల్లడించింది. దినేష్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసును కోర్టు కొట్టేసింది. సోమవారం విచారణ జరిపిన కోర్టు.., దినేష్ కు  అక్రమాస్తులు ఉన్నాయనేందుకు సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసును ఇక మూసివేయవచ్చని సీబీఐకి పరోక్ష సంకేతాలు ఇచ్చింది. దీంతో దినేష్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలు అవాస్తవం అని  కోర్టు నిర్దారించినట్లయింది.

ఉమ్మడి రాష్ర్టంలో.. ఉద్యమం సమయంలో ఏపీ డీజీపిగా దినేష్ రెడ్డి నియమితులయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన దినేష్ రెడ్డిని డీజీపిగా నియమించింది మొదలు ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. సీనియర్లను పక్కనబెట్టి దినేష్ ను డీజీపీని చేశారని ఒక అధికారి క్యాట్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై దాదాపు దినేష్ పదవిలో ఉన్నంతకాలమూ విచారణ జరిగింది. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని

అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అణిచివేశారని విమర్శలు వచ్చాయి. మాజి డీజీపీ వైఖరిపై అన్ని ఉద్యమ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా సరే ఆయన వైఖరిలో మార్పు రాలేదు. ఇక మాజిమంత్రి శంకర్రావు డీజీపీ దినేష్ రెడ్డిపై పోరు చేసిన రాజకీయ నేతగా చెప్పవచ్చు. కిరణ్ పై తరుచుగా విమర్శలు చేసినందుకు, శంకరన్న గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి.., ఆయన్ను అరెస్టు చేసేందుకు వ్యూహం రచించారని విమర్శలు ఎదుర్కున్నారు. అయితే అరెస్టు సమయంలో పోలిసుల అత్యుత్సాహం, నోటి దురుసు మాటలు మీడియాలో ప్రసారం కావటంతో రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పోలిసుల మాటలపై పార్టీలకతీతంగా నేతలు మండిపడ్డారు. అందరూ శంకరన్నకు నైతిక ధైర్యం అందించారు.

దీంతో అరెస్టు తంతు అక్కడితో అగిపోయింది. ఇక తన అరెస్టుకు దళిత, తెలంగాణ ఉద్యమ రంగు పులమటంతో పాటు, వారిపై కోపం పెంచుకున్న మాజిమంత్రి ప్రతి విషయంలో చిత్తూరు ప్రముఖులను ఇబ్బంది పెట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై అయితే ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేసేవారు. డీజీపీ దగ్గరుండి చందనం దుంగలను స్మగ్లింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో దినేష్ రెడ్డి ఆస్తులపై విచారణ జరపాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మాజిమంత్రి శంకర్రావు కూడా ఇందుకు మద్దతు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించిన న్యాయస్థానం ధర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.

మార్పు దినేష్ కు సహజమైంది

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం., పరిస్థితులను బట్టి నడుచుకోవటం రెండూ దాదాపు సమాన అర్ధాన్ని ఇస్తాయి. అయితే అది స్వీకరించేవారిలో తేడా ఉంటుంది. దినేష్ రెడ్డి ఈ రెండిటినీ సమానంగా  ఉపయోగించుకున్నారు. పదవిలో ఉన్నంతకాలం ముఖ్యమంత్రి చెప్పినట్లు విన్నారు. పదవికి రాజీనామా చేయగానే.., సీఎంపై విమర్శులు చేసి సంచలనం కల్గించారు. తెలంగాణకు వ్యతిరేకంగా తనతో కిరణ్ ప్రకటనలు చేయించారని.., కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపించారు. దీంతో అప్పటికే కిరణ్ ను ఓ ఆట ఆడుకుంటున్న ప్రత్యర్ధి వర్గం, ప్రతిపక్షాలకు ఇది అదనపు బాల్ అయింది. డీజీపీ ఆరోపణలపై రాజకీయంగా దుమారమే రేగింది. కిరణ్ వైఖరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఆ తర్వాత రాష్ర్ట విభజన బిల్లు ఆమోదం, రాజకీయాలు జరగటంతో కొద్దికాలం సైలెంట్ గా ఉన్న దినేష్ రెడ్డి.., వైసీపీ తీర్థం పుచ్చుకుని మల్కాజ్ గిరి నుంచి పోటి చేసి ఓడిపోయారు. ఈ మద్యే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపిలో చేరారు. అయితే ఈ చేరిక ఉన్నత పదవులను ఆశించి జరిగినది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి కెరీర్ చివర్లో వివాదాలు, విమర్శలకు గురయిన దినేష్ విభజన తర్వాత కాస్త కోలుకున్నారు. ఇప్పుడు కేసు కూడా లేకపోవటంతో ఇక కుదురుకుంటారని సన్నిహితులు అంటున్నారు. 
 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dinesh reddy  disapproriate assets  supreme court  latest news  

Other Articles