Actor mla balaiah visits hindupur

Actor, MLA, Balakrishna, Hindupur, development activities, ministers, officials

Actor, MLA balaiah visits Hindupur 2 hours late than sheduled..participated in development activities

ముఖ్యమంత్రిగారి వియ్యంకుడా...మజాకా!

Posted: 09/12/2014 03:04 PM IST
Actor mla balaiah visits hindupur

ఆలస్యంగా రావడమే కాకుండా, రెండు గంటలుగా తన కోసం పడిగాపులు కాస్తున్న మంత్రులను కాదని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ....నేరుగా శంకుస్థాపనలకు వెళ్లిపోవటంతో బాలయ్యా...మజాకా...అనుకకోవటం అధికారులు, కార్యకర్తల వంతైంది. హిందుపురం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు సమాచారం అందించారు. నిర్ధేశిత సమయానికి రావాల్సిన బాలయ్య.. రెండు గంటలు అలస్యంగా వచ్చారు. అప్పటికే రెండు గంటల నుంచి బాలయ్య కోసం జాతీయ రహదారిపై మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు హెల్త్ కమిషనర్ సౌరభ్ గౌర్, ఆర్డీవో, డీఆర్డీఏ పీడీ తదితరులు  ఎదురు చూశారు.

షెడ్యూల్ కన్నా రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన బాలయ్య ....మంత్రులను పట్టించుకోకుండానే కొట్నూరులో పాఠశాల భవనాల భూమిపూజ కార్యక్రమానికి వెళ్లిపోయారు. మంత్రులు అధికారులు ఎక్కడున్నారన్న సమాచారం సరిగ్గా అందుకోని బాలయ్య, నేరుగా తన షెడ్యూలు కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఇంకేముంది సమాచారం అందుకున్న మంత్రులు, అధికారులు బాలయ్య వున్న చోటికి పరుగులు తీశారు.. ముఖ్యమంత్రి గారి వియ్యంకుడా మజాకా..? అంటూ సరదాగా వ్యాఖ్యానించిన మంత్రులు, అధికారులు అనంతరం ప్రభుత్వాస్పత్రి సందర్శన సందర్భంగా బాలయ్యను పొగడ్తలతో ముందెత్తారు.

ఆ తరువాత సూరప్పగుంట ప్రాంతంలో సమ్మర్‌ స్టోరేజ్‌, ఉద్యానవనం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న స్థలాన్ని బాలయ్య పరిశీలించారు. అన్యాక్రాంతానికి గురైన ప్రాంతాలపై కలెక్టర్‌, స్థానిక అధికారులతో చర్చించిన బాలయ్య.. సదరు స్థలాన్ని విక్రయించిన వారితో పాటు కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకేరోజు 11 కార్యక్రమాలను రూపొందించటం, బాలయ్య రెండు గంటలు ఆలస్యంగా రావటంతో కార్యక్రమాలన్నీ హడావిడి మధ్య సాగినా.. అన్ని సక్రమంగానే పూర్తయ్యాయి. బాలయ్యను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు వారిని అదుపు చేశారు.

జి.మనోహర్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor  MLA  Balakrishna  Hindupur  development activities  

Other Articles