Employees union gif

apsrtc, tsrtc, apsrtc strike, buses strike, bus ticket booking, bus routes, bus route timings, employees union, tmu, nmu, mahamood, latest news

employees union leaders annouced no strike in andhrapradesh as talks with management is fruitful : rtc buses will remain on roads no strike and management promises to solve demands of rtc emplyoees

బస్సులు నడుస్తాయి.. భయపడవద్దు !!

Posted: 09/10/2014 05:38 PM IST
Employees union gif

ఆర్టీసీలో సమ్మె జరుగుతుందని ఊహించుకుని ఆందోళనలో ఉన్న ప్రయాణికులకు ఊరట.  గురువారం నుంచి తలపెట్టిన సమ్మె పిలుపును కార్మికులు వెనక్కి తీసుకున్నారు. సంస్థ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావటంతో  సమ్మె చేయటం లేదని ఎంప్లాయిస్ యూనియ్ ప్రకటించింది. తమ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించినట్లు కార్మిక నేతలు తెలిపారు. అపరిష్ర్కుత డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈయూ సమ్మెకు పిలుపునివ్వగా.., బుధవారం మధ్యాహ్నం పలు దఫాలుగా యాజమాన్యం వారితో చర్చలు జరిపింది.

ప్రధాన సమస్యలపై నిర్ణీత గడువు లోగా పరిష్కరిస్తామని చర్చల్లో యాజమాన్యం హామి ఇచ్చింది. అంతేకాకుండా కార్మికుల సొసైటీ, డీఎ బకాయిల చెల్లింపుకు సంస్థ యాజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా పండగ అడ్వాన్సులు చెల్లించేందుకు కూడా అంగీకరించింది. ప్రధాన డిమాండ్లు పరిష్కారం కావటంతో సమ్మె పిలుపును ఉపసంహరించుకున్నట్లు ఈయూ నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో జరిగిన ఈ చర్చల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు ఈయూ ప్రధాన నేతలు పాల్గొన్నారు.

1958లో ప్రారంభమైన రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థగా గుర్తింపు పొందింది. సామాన్యుడు వెళ్లే పల్లె వెలుగు బస్సులు మొదలుకుని విలాసవంతమైన సౌకర్యాలుండే వెన్నెల, గరుడ ప్లస్ బస్సులను కూడా సంస్థ నడుపుతోంది. కేవలం రాష్ర్టంలోనే కాకుండా ఇతర రాష్ర్టాలకు కూడా సర్వీసులు నడుపుతూ ప్రయాణికులను చేరవేస్తుంది. అయితే సేవలకు తగిన ఆదాయం లేకపోవటంతో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ప్రభుత్వ సాయం పొందుతూ కార్పోరేషన్ గా ఆర్టీసి కొనసాగుతోంది. విభజన నేపథ్యంలో సంస్థలోనూ విభజన తప్పలేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apsrtc  strike  employees union  buses  

Other Articles