Apple ready release iphone 6 in india by october

apple, apple phones, apple iphones, i phones, iphone 6, iphone 6plus, ipads, mobiles, new mobiles, nokia, samsung, micromax, sony, motorola, gadgets, latest news

apple announced that it would release iphone 6 and 6plus models from october 17th in india : fans waiting for apple's iphone 6 and 6plus

యాపిల్ ఐ-ఫోన్6 ప్రత్యేకతలు

Posted: 09/10/2014 02:44 PM IST
Apple ready release iphone 6 in india by october

యాపిల్ పోన్ అభిమానులు, వినియోగదారులకు కంపనీ శుభవార్త తెలిపింది. మార్కెట్ లోకి ఐ-ఫోన్ 6ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ రెండు మోడళ్ళను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. భారత్ లో ఈ రెండు మోడళ్ళ ఫోన్లు అక్టోబర్ 17నుంచి అందుబాటులోకి వస్తాయని సంస్థ భారతీయ విభాగం ప్రకటించింది. పండగ సీజన్లను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ లో విడుదల చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలంటున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో దసరా పండగ ఉండగా చివరి వారంలో దీపావళి పండగ ఉంది. రెండు పండగల మద్య ఈ ఫోన్ విడుదల అవుతోంది. దీంతో పండగ బోనస్ వచ్చే వారు ఫోన్ కొనేవిధంగా ఆలోచించేలా యాపిల్ ప్లాన్ వేసింది.

ప్రత్యేకతలెన్నో

ఇక గత మోడళ్ల కంటే ప్రస్తుత ఐఫోన్6, ఐఫోన్ 6ప్లస్ ఫోన్లలో మరిన్ని ప్రత్యేకతలున్నట్లు కంపనీ ప్రకటించింది. పూర్తిగా అప్ డేట్ చేసిన ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో వినియోగిస్తున్నారు. దీంతో పాటు రెండు ఫోన్లలోనూ రెటీనా హెచ్ డీ స్ర్కీన్ అమర్చారు. రెండు ఫోన్లు ‘ఏ8 64బిట్ చిప్’ ఆధారంగా పనిచేయనున్నాయి. ఇది గతంలో విడుదల చేసిన ‘ఎ7 చిప్’ కంటే చిన్నది, అంతేకాకుండా ఎక్కువ వేగంతో పనిచేస్తుంది. 8మెగాపిక్సెల్ కెమెరాను రెండు ఫోన్లకు అందిస్తున్నారు. దీనిలోని ‘ఐ సైట్ సెన్సర్’ టెక్నాలజి ఫొటోలను మరింత క్వాలిటీగా, రియాలిటీగా అందిస్తుంది. రెండు ఫోన్ల కోసం కొత్తగా 1.3మిలియన్ల యాప్ లు సిద్ధం చేసి ఉంచింది యాపిల్.

ఐఫోన్6-6ప్లస్ తేడాలు

రెండు ఫోన్లు టెక్నాలజి పరంగా ఒకేలా ఉన్నా కొన్ని తేడాలు ఉన్నాయి. సైజుల్లో మాత్రం తేడాలు చూపించారు. ఐఫోన్ 6 స్ర్కీన్ పొడవు 4.7 ఇంచులు ఉంటే.., ఐఫోన్ 6ప్లస్ పొడవు 5.5 ఇంచులుగా యాపిల్ ప్రతినిధులు తెలిపారు. వెడల్పులో కూడా ఐఫోన్ 6 6.8 మిల్లీ మీటర్లుంటే, 6ప్లస్ 7.1మిల్లీ మీటర్ల మందం ఉంది. అంతేకాకుండా కెమెరాలకు సంబంధించి ఐఫోన్ 6లో ‘డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్’ ఉండగా.., 6ప్లస్ లో ‘ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్’ ఉంది. దీంతోపాటు టాక్ టైం కూడా తేడా ఉంది. ఐఫోన్ 6ప్లస్ 3జీ కాల్స్ మాట్లాడితే గరిష్టంగా 24గంటల టాక్ టైం ఉంటుంది. అదే ఐఫోన్ 6 అయితే మాత్రం కేవలం 14గంటల 3జీ టాక్ టైం కలిగి ఉంది. 6తోపోలిస్తే 6ప్లస్ కొంత ప్రత్యేకతను సొంతం చేసుకుందని స్వయంగా యాపిలే చెప్తుంది.

దీన్నిబట్టే రెండు ఫోన్ల మద్య వేల రూపాయల ధర తేడా ఉందని అర్ధమవుతోంది. ఇక ఈ ఫోన్ల ధర విషయానికి వస్తే.., గతంలో వచ్చి ఐఫోన్ సిరీస్ ధరలను పోల్చి చూస్తే అరవై వేలకు పైమాటే అని విన్పిస్తోంది. చూడాలి మరి దేశ మార్కెట్లో దిగే సరికి ఆరు పదులు అవుతుందా లేక డెబ్బయి కే లు దాటుతుందా అని.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apple  iphone6  iphone 6plus  latest news  

Other Articles