Lokesh gets grip on tdp activities

lokesh, nara lokesh, balakrishna, chandrababu naidu, chandrababu naidu family, andhrapradesh, tdp, telugu desham party, government, hyderabad, ntr bhavan, telangana, latest news, politics

chandrababu son lokesh get full grip on tdp activities : lokesh daily busy with party leaders meetings and discussions with chandrababu naidu about party updates

చినబాబుకు పార్టీపై పట్టు పెరుగుతోందా ?

Posted: 09/09/2014 11:50 AM IST
Lokesh gets grip on tdp activities

నారా లోకేష్. చంద్రబాబు తనయుడుగా అందరికీ సుపరిచితుడు. రాజకీయాల్లో నేరుగా ప్రెస్ మీట్లు పెట్టకుండా ట్విట్టర్ పిట్ట ద్వారా సందేశాలు అందించే నాయకుడు. తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో పరిపాలనతో బిజీగా గడుపుతున్నారు. రాజధాని నిర్మాణం, రాష్ర్ట పరిపాలన.., సమీక్షలు, సమావేశాలు క్షణం తీరికలేకుండా చంద్రబాబు గడుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఆయన కొద్ది కాలంగా పార్టీని పూర్తిస్థాయిలో పట్టించుకోవటం లేదు. ఈ బాధ్యతను లోకేష్ కు అప్పగించారు. అనధికారికంగా పగ్గాలు పట్టుకన్న లోకేష్ పార్టీపై బాగానే పట్టుసాధించినట్లు కన్పిస్తోంది.

తండ్రి పాలనతో బిజీగా ఉండటంతో పార్టీ కార్యక్రమాలను లోకేష్ చూసుకుంటున్నారు. ఆయన హెరిటేజ్ సంస్థను తల్లి భువనేశ్వరి చూసుకుంటోంది. ఉదయమే పార్టీ కార్యాలయానికి వచ్చి.., తన టీంను కలుస్తున్నారు. అప్ డేట్స్ పై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో వస్తున్న స్పందన.., కొత్తగా నిర్ణయాలు తీసుకునేందుకు సలహాలపై చర్చలు జరుపుతున్నారు. ఆ తర్వాత కొద్దిసేపు జిల్లాల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలను కలిసి పార్టి విషయాలపై చర్చిస్తున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిరిగి పార్టీ నేతలను కలిసి తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు.

నేతలనే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర స్థాయిల్లోని ప్రజా ప్రతినిదులు కూడా లోకేష్ బాబును పార్టీకార్యాలయానికి వచ్చి కలిసి వెళ్తున్నారు. వారితో పాలన పనితీరు, రాజకీయాలపై సునిశిత చర్చలు జరుపుతున్నారు. పొద్దుపోయేవరకు పార్టీ నేతలతో సమావేశాలతో బిజీగా ఉంటున్న చిన్నబాబు.., రాత్రి తండ్రికి అప్ డేట్స్ అందించే పనిలో ఉంటాడు. అంటే ఆ రోజు చర్చించిన విషయాలు, కలిసిన నేతలు, వారితో జరిగిన సమావేశాలు, ఇలా పార్టీ పరిణామాలపై పూర్తి సమాచారం అధ్యక్షుడికి చేరవేస్తున్నారు.

లోకేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తనను కలిసిన నేతలకు ఏం చెప్పాలి. ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై చంద్రబాబు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా లోకేష్ రోజు గడుస్తోంది. ప్రస్తుతం పార్టీలో కార్యకర్తల సంక్షేమ నిధి పర్యవేక్షకుడి హోదాలో ఉన్న లోకేష్ ను చంద్రబాబు ఇంకా పార్టీ సారధిగా ప్రకటించలేదు. అయినా సరే చినబాబు హోదాలో పార్టీపై పట్టు సాధిస్తున్నారు. రాజకీయ నేతగా ఇది హర్షించదగిన విషయమే అయినా.. వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నందుకు బాధపడక తప్పదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  tdp  chandrababu  latest news  

Other Articles