Al qaeda terrorist may attack in india as like 26 11 mumbai attacks

al qaeda, al qaeda attacks, mumbai 26/11 attack, lashkar e taiba attacks india, terrorists attack india, america government, mumbai blast, mumbai attacks, narendra modi government, central home minister rajnath singh

al qaeda terrorist may attack in india as like 26/11 mumbai attacks : As per intelligence sources.. al qaeda may attack india as like 26/11 mumbai attack to prove their terrorism in the worldwide

బారత్ కు పొంచి వున్న ముప్పు... 26/11 తరహాలో దాడులు సిద్ధం!

Posted: 09/06/2014 03:20 PM IST
Al qaeda terrorist may attack in india as like 26 11 mumbai attacks

(Image source from: al qaeda terrorist may attack in india as like 26/11 mumbai attacks)

ఇటీవలే అల్-కాయిదా చీఫ్ అల్ జవహరి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ ఒక వీడియో ప్రసంగం ద్వారా అందరికీ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే! దీంతో ఇది భారత్ లో సరికొత్త ప్రమాదాలకు తావిస్తోంది. ఇప్పటికే ఈ ఉగ్రవాద సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ సాయంతో తన సొంత ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో వున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తుంటే.. మన భారతదేశానికి మరోసారి 26/11 దాడి పొంచి వుందనే అనుమానాలను నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా ఇటువంటి తరహాలోనే పాకిస్తాన్ తీవ్రవాదులు ముందుగా హెచ్చరికలు జారీ చేసి, ముంబైలో మారణహోమాన్ని సృష్టించిన విషయం తెలిసిందే! ఆ ఘటనలో ఎంతోమంది దుర్మరణం చెందగా.. కొంతమంది పోలీసు అధికారులు అమరవీరులుగా వుండిపోయారు.

అల్-కాయిదా విషయంలో అమెరికా పెద్దగా స్పందించలేదు కానీ.. మన భారతదేశం ప్రభుత్వం మాత్రం వెంటనే అప్రమత్తమైందని తెలుస్తోంది. ఇప్పటికే హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర నిఘా ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇలావుండగా.. ప్రధాని మోడీకి కూడా దేశంమీద ముంబై తరహా దాడి జరిగే అవకాశాలున్నట్లు పక్కాగా సమాచారం అందినట్టు తెలిసింది. దీంతో దేశవ్యాప్తంగా వున్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయడం జరిగింది. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సేనలు ఈ ఏడాది చివరికల్లా వెళ్లిపోతాయి కాబట్టి, ఆ దేశం పెద్దగా అల్ కాయిదా గురించి పట్టించుకోవట్లేదు గానీ.. భారత్ మాత్రం అంత తేలిగ్గా తీసి పారేసే పరిస్థితి లేదు. అందుకు ఉదాహరణగా మనం ముంబై దాడులను అభివర్ణించుకోవచ్చు. ముంబై అనుభవం మన దేశ భద్రతా వ్యవస్థలోని లోపాల గురించి సమీక్షించుకోడానికి ఓ అవకాశం కల్పించింది.

ఇదిలావుండగా.. మన భారతదేశం ఉగ్రవాద దాడులకు ఎంతో అనుకూలంగా వుందంటూ భద్రతారంగ నిపుణులు ఎప్పటికనుంచో మొత్తుకుంటూనే వున్నారు. ఎందుకంటే.. మనదేశంలో జనసాంధ్రత అదుపులేకుండా భారీగా పెరిగిపోతోంది. అలాగే అడుగడునా అవినీతి పెచ్చుమీరిపోతోంది. నమ్మకం అనే పదంతో మన దేశానికి సంబంధం లేనట్టుగా ఇక్కడి ప్రజల వ్యవహారం.. పోలీసు శాఖలో అసమర్థత.. నిఘావ్యవస్థలో లోపాలు.. ఇలా అన్ని ఒకేసారి వుండటం వల్ల ఉగ్రవాద దాడులకు దేశం కేంద్రంగా మారుతోందని వాళ్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా డబ్బులు ఎరగా వేస్తే ఇక్కడి వ్యక్తులే ఉగ్రవాదులకు సమాచారం అందిస్తున్నారని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే.. ఇప్పట్లో కాకపోయినా రాబోయే రెండేళ్ల మధ్యకాలంలో ఖచ్చితంగా  26/11 తరహా దాడి జరిగే ప్రమాదం జరిగే అవకాశాలు వున్నాయని బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే అందరూ అప్రమత్తంగా వుండాలంటూ ఆ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది.

అయితే అల్-కాయిదా ఈ దాడులకు ఎందుకు పాల్పడుతుందో తెలుసా...? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉగ్రవాదసంస్థలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న తరుణంలో ‘‘అల్-కాయిదా’’ పూర్తిగా వెనుకబడి వుంది. దీంతో అది తన ఉనికిని చాటుకోని, ఆధిపత్యం నిరూపించుకోవడం కోసమే దాడులకు పాల్పడేందుకు సిద్ధంగా వుందని.. అందుకు భారత్ ను లక్ష్యం చేసుకుని తప్పకుండా దాడి చేసే ప్రయత్నం చేస్తుందని నిపుణులు అంటున్నారు. గతంలో ముంబైలో జరిగిన దాడుల వెనుక మతలబు కూడా ఇటువంటిదే! లష్కరే తోయిబా తమ ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా చాటుకోవడం కోసమే అప్పట్లో దాడులకు పాల్పడిందనే వాదన వుంది. ఇప్పుడు అల్-కాయిదా కూడా అటువంటి ప్రయత్నానికి ఒడిగడుతోందనే సమాచారం పక్కాగా వుందంటూ నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. మరి మన భారతప్రభుత్వం ఈ దాడులను ఎలా ఎదుర్కుంటుందో..? వారికి ఎలా సమాధానం చెబుతుందో..? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai 26/11 attacks  al qaeda  lashkar e taiba  narendra modi  rajnath singh  

Other Articles