Mp kavitha on hyderabad

mp kavitha, telangana jagruti, telangana state, latest news, mp list, mla list, telangana mla, mps, telangana news, telangana movement, kcr, ktr, trs, harish rao, kcr family, hyderabad, andhra pradesh

mp kavitha says andhrapradesh people has no rights on hyderabad : hyderabad is common capital but not joint capital says mp kavita

హైదరాబాద్ పై సీమాంధ్రులకు అధికారాల్లేవ్ !!

Posted: 09/03/2014 10:30 AM IST
Mp kavitha on hyderabad

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి వివాదానికి తెరతీశారు. ఎంపీ కావటంతోనే కాశ్మిరీ సమస్యను కదిపి కుదిపేసిన కవిత.., ఇప్పుడు హైదరాబాద్ అంశంతో హడలెత్తిస్తున్నారు. విభజన సమయంలో వివాదాలకు కేంద్రబిందువైన హైదరాబాద్ ను మరోసారి తగువుకు తీసుకొచ్చారు. విభజన బిల్లులో హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి కొత్త అర్ధాలు చెప్తున్నారు. సీమాంధ్రులకు అధికారాలా అంటూ నోరెళ్ళబెడుతున్నారు.

జాయింట్ కాదు కామన్

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కవిత ప్రసంగించారు. హైదరాబాద్ పై సీమాంధ్రులకు ఎలాంటి అధికారాలు ఉండవన్నారు. ఇది తాను చెప్తున్నది కాదనీ.. తెలంగాణ బిల్లే ప్రకటిస్తోందన్నారు. ‘‘హైదరాబాద్ కామన్ క్యాపిటల్ తప్ప జాయింట్ క్యాపిటల్ కాద’’న్నారు. కాబట్టి కామన్ క్యాపిటల్ లో పక్క రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ కు హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి కూడా స్పెషల్ ఇంక్రిమెంట్ పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామన్నారు. జూన్ రెండు తర్వాత ఉద్యమాలకు విరామం ఉంటుంది అనుకుంటే తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్; విద్యుత్, పోలవరం, ఉద్యోగుల విభజన, గవర్నర్ గిరీ ఇలా ప్రతి అంశంపై పోరాటం చేయాల్సి వస్తోందన్నారు.

తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థ నాయకురాలి స్థాయి నుంచి ఎంపీ అయిన తర్వాత కవిత తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. ఎంపిగా తొలిరోజుల్లోనే కాశ్మీర్, హైదరాబాద్ భారత దేశంలో భాగాలు కాదంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. బాద్యత తెలుసుకుని మాట్లాడాలని అన్ని వర్గాలు చివాట్లు పెట్టాయి. ఆ తర్వాత ఇదే కాశ్మిర్ లో పండితుల అంశంపై పార్లమెంట్లో ప్రసంగించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ హక్కులపై నోరు మెదిపారు. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kavitha  andhrapradesh  hyderabad  latest news  

Other Articles