Telangana government proposet to run bullet trains

bullet trains, trains, train reservation, railway stations, buses, mobility, economic developement, kcr, telangana, trs, telangana government, metro rail, l and t, hmda, ghmc, huda, latest news, hyderabad

telangana goverment proposed to run bullet trains from hyderabad to major towns in state : hmda planning to run bullet trains in telangana to develope state and people's economic activity

తెలంగాణలోకి బుల్లెట్లు దింపుతున్న కేసీఆర్

Posted: 09/02/2014 11:04 AM IST
Telangana government proposet to run bullet trains

తెలంగాణ రాష్ర్టంలో ప్రపంచస్థాయి సౌకర్యాలు తీసుకువచ్చేందుకు కేసీఆర్ ఉవ్విళ్ళూరుతున్నారు. ఉన్నవి తక్కువ నిధులే అయినా.., ప్రజలకు ప్రపంచ సౌకర్యాలు పరిచయం చేయాలని ఆశపడుతున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే లోకల్ ప్రయాణాల కోసం ఎంఎంటీఎస్ రైలు ఉంది. ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామంటూ మెట్రో రైలు తీసుకొస్తున్నారు. తాజాగా బుల్లెట్ రైళ్లను తేవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ ప్రతిపాదనకు టెంటర్లను పిలుస్తారని సమాచారం వస్తోంది.

హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్.ఎం.డి.ఎ) ఆద్వర్యంలో ఈ ప్రాజెక్టు జరగనుందని వార్తలు వస్తున్నాయి. కేవలం హైదరాబాద్ కే రైలు పరిమితం చేయకుండా తెలంగాణలోని ప్రధాన పట్టనాలకు దూసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పది జిల్లాల వ్యాప్తంగా మెత్తం 1,141 కిలోమీటర్ల పరిధిలో బుల్లెట్ రైలు నడుస్తుందని హెచ్.ఎం.డి.ఎ. వర్గాలు చెప్తున్నాయి. రాష్ర్ట రాజధాని హైదరాబాద్ ను కలిపేలా పది జిల్లాల్లోని ప్రధాన పట్ఠణాల నుంచి రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు.

ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్ తో పాటు అదిలాబాద్ ప్రాంతాలకు బుల్లెట్లను పంపాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఆర్ధిక లావాదేవీలు, స్థితిగతులు మెరుగుపర్చే ఉద్దేశ్యంతోనే ఈ రైళ్ళు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే బుల్లెట్ రైళ్ళ వల్ల దూర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారికి ప్రయాణ సమయం తగ్గుతుంది. అంతేకాకుండా జిల్లాల నుంచి ఉద్యోగాలు, చదువుల కోసం వచ్చే వారు కూడా నగరంలోనే ఉండకుండా.., నేరుగా రోజూ ఇంటి నుంచి వచ్చేందుకు వీలు కల్పిస్తుంది. దీని కారణంగా కుటుంబంలో ఖర్చులు తగ్గి ఆర్ధికంగా కాస్త వెనకేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bullet trains  telangana  hmda  latest news  

Other Articles

Today on Telugu Wishesh