Ram gopal varma settairs on lord vinayaka

ram gopal varma, ram gopal varma twitter, ram gopal varma movies, ram gopal varma vinayaka chavithi, ram gopal varma lord ganesh

ram gopal varma settairs on lord vinayaka : the controversial director ram gopal varma tweeted settairic comments on lord vinayaka

చివరికి గణేశుని బొజ్జ మీదా సెటైర్లు వేసిన వర్మ

Posted: 08/29/2014 06:58 PM IST
Ram gopal varma settairs on lord vinayaka

(Image source from: ram gopal varma settairs on lord vinayaka)

రాంగోపాల్ వర్మ... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వున్న ఒకేఒక వివాదాస్పద దర్శకుడు! వర్మ తన సినిమాలకంటే అతను చేసిన సంలచన వ్యాఖ్యల ద్వారానే బాగా పాపులర్ అయ్యాడని చెప్పుకోవడం ఎటువంటి సంశయం లేదు. సమయం, సందర్భాన్ని బట్టి సెటైర్లు వేయడంలో ఈయనకు ఈయనే సాటి! సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, దిగ్గజ వ్యాపార వ్యక్తులు అని తేడా లేకుండా ఎవరిమీద పడితే వారిమీద అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసి, టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోతాడు.

అయితే ఈసారి వెరైటీగా తనదైన శైలిలో వినాయకుడి మీద సెటైర్లు వేశాడు వర్మ! గణేష్ చతుర్థి ఏ సందర్భంలో జరుపుకుంటారు..? అంటూ ట్విటర్ లో ప్రశ్నించడం మొదలుపెట్టేశాడు. అంతేకాదు.. ‘‘వినాయకునికి బొజ్జెలా వచ్చింది చెప్మా..?’’ అంటూ సెటైరిక్ కామెంట్లు చేశాడు. ‘‘వినాయకునికి బొజ్జ చిన్నప్పటి నుంచి వుందా..? లేక ఏనుగు తల అతికించిన తరువాత పెరిగిందా..?’’ అంటూ ధర్మసందేహాలను వెలిబుచ్చాడు వర్మ. అలాగే... ‘‘వినాయక చవితి అంటే గణపతి పుట్టిన రోజా..? లేక తండ్రి అతని తల నరికిన రోజా..? ఎవరైనా తెలిస్తే చెప్పండ్రా బాబూ’’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు.

వర్మ ఈ విధంగా పోస్ట్ చేయడంపై చూసిన నెటిజన్లు కూడా ముందుగా అవాక్కయ్యారు. తర్వాత వర్మ స్టైలే వేరంటూ లైట్ తీసుకున్నారు. ఆయన అడిగిన ప్రశ్నలకు కొంతమంది అదే తరహాలో సమాధానాలు కూడా సంధించారు. ఇదిలావుండగా.. వర్మను ఈ విధంగా గణేశుని మీద ట్విటర్ లో ఎందుకు కామెంట్లు చేశారు అని అడగగా.. అందుకు తాను చెప్పగలిగింది ఏమీ లేదని.. చెప్పాలనుకుంది ట్వీట్ల ద్వారా చెప్పేశానని బదులిచ్చాడు. ఏదేమైనా వర్మను అర్థం చేసుకోవడం ఎవరివల్లా కాదులెండి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  twitter  vinayaka chavithi  

Other Articles