Former mla jagga reddy apologise to congress

jagga reddy, former mla jagga reddy latest news, jagga reddy bjp party, pawan kalyan, pawan kalyan jagga reddy, jagga reddy congress party

former mla jagga reddy apologise to congress : the former mla of medak districti jagga reddy apologise to congress leaders for changing party without intimation them

బీజేపీలో చేరినందుకు నన్ను క్షమించండి : జగ్గారెడ్డి

Posted: 08/29/2014 02:49 PM IST
Former mla jagga reddy apologise to congress

(Image source from: former mla jagga reddy apologise to congress)

కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తనకు మెదక్ ఎంపీ టికెట్ లభించనందున బీజేపీ పార్టీ నుంచి జగ్గారెడ్డి తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే! అయితే ఆయన ఎప్పుడు పార్టీ జంప్ అయ్యారనే విషయం ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ స్థానం నుంచి బీజేపీ తరఫు నుంచి ఇంకొకరు పోటీ చేస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో హఠాత్తుగా ఈయన వచ్చి చేరిపోయారు. దీంతో ఈ విషయం వెనుక పవన్‌కల్యాణ్ హస్తం వుందనే ప్రచారాలు కూడా జోరుగా సాగిపోయాయి. ఈ విషయాలన్నీ పక్కనపెడితే.. తాజాగా జగ్గారెడ్డి బీజేపీ పార్టీలో చేరినందుకు క్షమాపణలు చెప్పుకుంటున్నారు.

అయితే ఆయన క్షమాపణలు చెబుతున్నది ఎందుకనుకుంటున్నారా..? సాధారణంగా ఒక పార్టీ నుంచి మరోపార్టీలోకి చేరేముందు చర్చలు జరుపుతారు. కానీ జగ్గారెడ్డి విషయంలో అలా జరగలేదు. దీంతో ఆయన ముందుగా చెప్పకుండానే పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పుకున్నారు. పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్ ఏర్పాటు చేసిన టీజేఆర్ యువసే, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జగ్గారెడ్డి.. తాను ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే బీజేపీ పార్టీలోకి చేరినందుకు క్షమించాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలతో వేడుకున్నారు.

‘‘పార్టీ మారే విషయంపై మీతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి వున్నప్పటికీ.. అంత సమయం లేకపోవడంతో చెప్పలేకపోయా! కాబట్టి మీరంతా పెద్ద మనస్సుతో నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ తరఫున టికెట్ రాకపోవడంతో బీజేపీ నాయకులు నన్ను ఆహ్వానించి పోటీచేయమన్నారు. అందువల్లే నేను ఆ పార్టీలోకి చేరాను. కేవలం అభివృద్ధి చేయడం కోసం మాత్రమే పార్టీ మారాను.. అంతేకాని సీటు కోసం ఆశపడలేదు’’ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు. దీనికి తన మిత్రులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ సహకరించాలని ఆయన కోరారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagga reddy  medak mp elections  pawan kalyan  telugu news  

Other Articles