Bjp leader amit shah cancelled chartered flight to advani

narendra modi, advani, amit shah, bjp party leaders, chartered flight, narendra modi advani, amit shah

bjp leader amit shah cancelled chartered flight to advani : amit shah cancelled the chartered fligh to advani on the orders of narendra modi

మోడీ-అమిత్ షా కుమ్మకై అద్వానీకు చుక్కులు చూపించారా!

Posted: 08/22/2014 10:07 AM IST
Bjp leader amit shah cancelled chartered flight to advani

ఈ మాట వినడానికి నమ్మశక్యం కాకపోయినా.. నిజంగానే జరిగింది. బీజేపీ పార్టీ పుట్టినప్పటినుంచి మూలస్తంభంగా వుంటూ నేడు ఆ పార్టీ అగ్రనేతగా నిలిచిన అద్వానీనే.. నిన్నగాక మొన్నచ్చిన అమిత్ షా పట్టపగలే చుక్కలు చూపించారు. పార్టీ సీనియర్ నేత అని చూడకుండా నిట్టనిలువునా అమిత్ షా ఆయనను అవమానపరిచేశాడు. అయితే దీని వెనుక మోడీ హస్తం కూడా వుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మోడీ ఇచ్చిన ఆదేశా మేరకే అమిత్ షా ఈ విధంగా అద్వానీతో వ్యవహరించారని సాక్షాత్తూ ఆ పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. దీంతో ఇప్పుడిది పెద్ద దుమారంగా మారిపోయింది. అయితే ఇలా చేయడానికి వెనుక ఒక మంచి కారణాన్ని కూడా వాళ్లు విశదీకరిస్తున్నారు.

అదేమిటంటే.. మోడీ ఒకవైపు భారతదేశాన్ని అభివృద్ధి చేసే పనిలో పూర్తిగా మునిగిపోయి వుండగా.. మరోవైపు తన ప్రభుత్వ హయాంలో వున్న నేతలందరూ ఎక్కువ ఖర్చులు చేయకుండా తక్కువ ఖర్చులోనే ప్రభుత్వ నిధులను అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీతో సహా కేబినెట్ సహచరులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ నేతలందరూ ఇకనుంచి ఆచితూచి ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ చేసేశారు. దాంతో మోడీ ఏర్పాటు చేసిన ఈ పొదుపు మంత్రాన్ని .జపించడం అందరూ ప్రారంభించేశారు. ఈ విషయంలో మిగతా నాయకులు, ప్రభుత్వం తీరు ఎలా వున్నా... మోడీకి అత్యంత సన్నిహితుడై అమిత్ షా మాత్రం ఈ మంత్రజపాన్ని అప్పుడే జపించడం మొదలుపెట్టేశారు.

ఈ పొదుపు మంత్రంలో భాగంగా.. పార్టీ నేతలందరూ అత్యవసరమైన పరిస్థితులను తప్పించి చార్టర్డ్ ఫ్లైట్లను వినియోగించరాదని తేల్చి చెప్పేసింది. ఒకవేళ ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే రైలు ప్రయాణాలను వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. అంతేకాదు.. పార్టీ కార్యక్రమాల కోసం ఇతర ప్రదేశాలకు వెళ్లే నేతలు.. అక్కడ స్టార్ హోటళ్లలో కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతిథి గృహాల్లో విశ్రమించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు మోడీ పొదుపు జపంలో భాగంగా అమిత్ షా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో బీజేపీ పార్టీలో వున్న నేతలందరూ ఇకనుంచి ఖర్చులను చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఇదిలావుండగా.. మొన్నామధ్య తనకు ఓ చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేయాలంటూ అద్వానీ పార్టీ కార్యాలయానికి ఒక సందేశాన్ని పంపారు. అయితే ఆ సందేశం ఎంత వేగంగా అయితే వెళ్లిందో.. అంతే వేగంగా ఖాళీగా వచ్చేసిందట! దీంతో అసహనానికి గురైన అద్వానీ.. మోడీతోపాటు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారని సమాచారం! అయితే మోడీ పొదుపు మంత్రం కాబట్టి జైట్లో కూడా ఈ విషయంలో అద్వానీకి ఏ సహాయం చేయలేక మౌనంగానే వుండిపోయారంటూ టాక్ నడుస్తోంది. దీంతో అద్వానీ మరింత మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. అమిత్ షా చేసిన ఈ చర్యతో కోపాద్రిక్తుడైన అద్వానీ.. ఆ తర్వాత పార్టీ పంపిన ఫ్లైట్ టికెట్ ను తిరస్కరించారని సమాచారం!

ఈ విషయం వెలుగుచూసిన వెంటనే అందరూ మోడీ - అమిత్ షాలు కుమ్మక్కై కావాలనే అద్వానీతో ఇలా వ్యవహరించారనే వాదనలను వినిపిస్తున్నారు. అయితే పొదుపు మంత్రంలో భాగంగా పార్టీ సీనియర్ నాయకులైనా సరే... ఖర్చులు ఎక్కువ చేయకుండా ప్రభుత్వ నిధులను ఉపయోగించాల్సిందేనంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి ఈ ఉదంతం మరిన్ని వివాదాలకు దారి తీస్తుందోనంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  advani  amit shah  bjp party leaders  chartered flight  

Other Articles