Tdp minister achhennayudu comments ys jagan killed paritala ravi

ys jagan mohan reddy, ys jagan latest news, tdp party ministers, tdp party mlas, former tdp leader paritala ravi, paritala ravi murder case, ys jagan paritala ravi, tdp minister achhennaayudu

Tdp minister achhennayudu comments ys jagan killed paritala ravi : tdp minister acchennaayudu controversial comments on ys jagan. He said ys jagan killed their party leader paritala ravi in the past

పరిటాల రవి హత్యకు వైఎస్ జగన్ కారణమా?

Posted: 08/18/2014 11:38 AM IST
Tdp minister achhennayudu comments ys jagan killed paritala ravi

టీడీపీ నేత పరిటాల రవిని హత్యకు వైఎస్ జగన్ కారణమో లేదో తెలియదు కానీ... టీడీపీ మంత్రి అయిన అచ్చెన్నాయుడు మాత్రం ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు. పరిటాల రవిని చంపింది వైఎస్ జగన్ కాదా? అంటూ ఆయన నిలదీశారు. అసెంబ్లీలో శాంతిభ్రదల తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబడిన వైకాపా సభ్యులు... తమ పార్టీలో వున్న నేతల హత్యలకు టీడీపీ పార్టీయే కారణమంటూ విమర్శలు లేవనెత్తిన సందర్భంలో అచ్చెన్నాయుడు మండిపడుతూ అలా ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. ‘‘శాంతిభద్రతల తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబడుతూ, సభా కార్యక్రమాలకు వైకాపా సభ్యులు అడ్డుపడుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే వున్నాయి. దీనిమీద అనవసరంగా వైకాపా సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన నేతలను టీడీపీ ప్రభుత్వం హత్యలు చేయిస్తోందంటూ వైకాపా నేతలు బూటకపు ప్రాచారాలకు దిగుతోంది. ఎవరు చనిపోయారు? ఎలా చనిపోయారు? అనే విషయాలపై సంపూర్ణమైన సమాచారాన్ని వైకాపా సభ్యులే అందిస్తే.. చాలా బాగుటుంది’’ అంటూ ఆయన సూచించారు. తీవ్ర నిరసనల మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియా లాబీలో ప్రసంగించారు.

ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. ‘‘వైకాపా సభ్యులు తమ సభ్యులను టీడీపీయే చంపించిందని చెబుతున్నారే.. మరి మా పార్టీ నేత పరిటాల రవిని చంపింది వైకాపా అధినేత జగన్ కాదా..?’’ అంటూ ఆయన నిలదీశారు. వైకాపా సభ్యులు తమ పద్ధతిని మార్చుకుని... విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేయకుండా సహకరించాలని ఆయన సూచించారు. ఇలా కానీ పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీలో ఈ విధంగా టీడీపీ, వైకాపా నేతలు ఆరోపణలు చేసుకుంటూ, వాగ్యుద్ధానికి దిగారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles